ఉచిత ఇసుకపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉచిత ఇసుకపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుకను ఉచితంగా అందించడమే లక్ష్యంగా సీనరేజీ రద్దు చేశామన్నారు. సొంత అవసరాలకు గ్రామ పంచాయతీల పరిధిలో మాత్రమే ట్రాక్టర్లతో ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చామన్నారు.
శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణ పనులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పునఃప్రారంభించారు. 2014-19లో భావనపాడు పోర్టు కోసం టెండర్లు సైతం పిలిచామని.. ప్రభుత్వం మారడంతో మూలపేటకు పోర్టును మార్చారని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం అనేది కంటిన్యూ కార్యక్రమం అని ఆయన తెలిపారు. అలా అమలు చేయకపోతే ఎంతో నష్టం ఉంటుందన్నారు.
హడావుడిగా టూర్ ముగించుకున్న డిప్యూటీ సీఎం పవన్: విజయనగరం జిల్లా గుర్లలో నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. స్థానిక పీహెచ్సీలో డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. వ్యాధి వ్యాప్తి, కారణాలపై అధికారులను ఆరా తీశారు. అయితే గంట వ్యవధిలోనే గుర్ల పర్యటనను డిప్యూటీ సీఎం ముగించారు. మూడు కుటుంబాలతోనే ఆయన మాట్లాడారు. పవన్ అభిమానులను పోలీసులు అదుపు చెయ్యలేక చేతులెత్తేశారు. మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు అరెస్ట్: వైసీపీ నేత, మాజీ మంత్రి…
పోలీస్‌స్టేషన్‌లో కుప్పకూలిన సీలింగ్: ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో పైకప్పునకు వేసిన సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సెక్టార్-1 ఎస్సై సత్యనారాయణ విధులు నిర్వహించే గదిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన సమయంలో ఎస్సై సత్యనారాయణ బయట వరండాలో ఉండటంతో ఆయనకు ప్రమాదం తప్పింది. సీలింగ్ కూలిన సమయంలో గదిలో ఎవరూ లేరని ఎస్సై తెలిపారు. బాచుపల్లిలో దారుణం: హైదరాబాద్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. బాచుపల్లిలోని నారాయణ కళాశాలలో…
Tiruvuru Police Station: ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో పైకప్పునకు వేసిన సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సెక్టార్-1 ఎస్సై సత్యనారాయణ విధులు నిర్వహించే గదిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన సమయంలో ఎస్సై సత్యనారాయణ బయట వరండాలో ఉండటంతో ఆయనకు ప్రమాదం తప్పింది. సీలింగ్ కూలిన సమయంలో గదిలో ఎవరూ లేరని ఎస్సై తెలిపారు. Also Read: South Africa Cricket: రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లోనూ ఓటమే.. దక్షిణాఫ్రికాను వెంటాడుతున్న దురదృష్టం! దశాబ్దాల కిందట నిర్మించిన…
కడప జిల్లా బద్వేల్ సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇంటర్ విద్యార్థినిని రోడ్డుపక్కనే చెట్లలోకి తీసుకెళ్లి విఘ్నేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ కేసులో పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తర్వాత కేబినెట్, ఎమ్మెల్యేల సమావేశంలో జమిలి ఎన్నికలకు సిద్ధం కావాలని సూచిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కూటమి మాటగా చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే ఈ ప్రభుత్వం కాలం రెండున్నర ఏళ్లు అని అర్థం అవుతుందన్నారు. అందుకే సంక్రాంతి వరకు కూటమి ప్రభుత్వానికి సమయం ఇద్దామనే మా ఆలోచన మార్చుకున్నామన్నారు.
విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా ప్రస్తుతం కంట్రోల్లో ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 13న తొలి డయేరియా కేసు నమోదైందని తెలిపారు. గుర్లలో ఎనిమిది మంది మృతి చెందినా.. ఇప్పటి వరకు డయేరియాతో మృతి చెందిన వారు ఒక్కరేనన్నారు.
మద్యం, ఇసుకలో దోపిడీ అంటూ జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పారదర్శకంగా జరిగిన మద్యం విధానంపై విమర్శలు సిగ్గు చేటన్నారు. ఎక్సైజ్ విభాగాన్ని నిర్వీర్యం చేసి మద్యాన్ని దోచుకోవడం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. సెబ్ పేరుతో అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డులేకుండా చేసుకోవడం నిజం కాదా అంటూ ప్రశ్నలు గుప్పించారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047 అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది పర్చాలనే లక్ష్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాధన దిశగా 20 సూత్రాల కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్ లంకా దినకర్ తెలిపారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు.