Minister Atchannaidu: శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణ పనులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పునఃప్రారంభించారు. 2014-19లో భావనపాడు పోర్టు కోసం టెండర్లు సైతం పిలిచామని.. ప్రభుత్వం మారడంతో మూలపేటకు పోర్టును మార్చారని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం అనేది కంటిన్యూ కార్యక్రమం అని ఆయన తెలిపారు. అలా అమలు చేయకపోతే ఎంతో నష్టం ఉంటుందన్నారు. పోలవరానికి కేంద్రం జాతీయ హోదా ఇచ్చిందన్నారు. పోలవరాన్ని మూలన పడేశారన్నారు. ఇదంతా ప్రజల డబ్బు అని.. ఇక్కడ భావన పాడు నుంచి మూలపేటకు పోర్టు మార్చారన్నారు. ఇక్కడ కొంత పనులు అయ్యాయిని.. ప్రజాధనం వృథా కాకూడదని చంద్రబాబు నిర్ణయించారన్నారు. ఇక్కడే ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. కేంద్రం ఉప్పు ల్యాండ్‌లు రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తామని చెప్పిందన్నారు. BPCL పెట్రో కంపెనీలు ఏర్పాటు చేయమని కోరామన్నారు. 6 నెలలకు ముందే భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి చేస్తామన్నారు. స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రతీ 50 కిలో మీటర్లుకు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.
Read Also: Ganderbal Terror Attack: ఉగ్రవాదంపై పోరులో దేశం ఏకమైంది: రాహుల్ గాంధీ
2025 జూన్ 12కి షిప్ తీసుకురావాలని చెప్పామన్నారు. మూలపేట, విష్ణు చక్రం గ్రామాలు ఇక్కడనుండి తరలించాలన్నారు. గతంలో వారందరికి అన్యాయం చేశారని.. వారికి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పోర్టు చుట్టూ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. లిక్కర్, ఇసుక పాలసీ లు అద్బుతమైన పాలసీలు అని మంత్రి పేర్కొన్నారు. గతంలో అంతా జగనే అని.. లిక్కర్‌లో కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. 6 రోజుల్లో 600 కోట్లు వచ్చాయని.. 5 సంవత్సరాలకు ఎంత రావాలి ఆలోచించాలన్నారు. 2 వేల కోట్లు అప్లికేషన్లలో ఆదాయం వచ్చిందన్నారు. ఎవరూ అమలు చేయడం లేదు.. ఇది పబ్లిక్ పాలసీ అని తెలిపారు. ఇసుకంతా.. జగన్ దోచుకున్నాడంటూ తీవ్రంగా మండిపడ్డారు.
ఉచిత ఇసుక ఇస్తున్నామని.. సీనరేజి సమస్య ఉండకుండా.. సీనరేజి రద్దు చేశామన్నారు. 300 కోట్లు నష్టం వచ్చినా సీనరేజి రద్దు చేశామన్నారు. ట్రాక్టర్ ఉంటే ఎవరైనా ఇసుక తెచ్చుకోవచ్చన్నారు. ఇసుక ట్రాక్టర్‌ను పోలీసులు ఎవరైనా అపితే యాక్షన్ తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుర్లలో సమస్య గత ప్రభుత్వ పాపమేనన్నారు. ఐదేళ్లలో గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. గుర్లలో వాటర్ కలుషితం అయ్యిందంటున్నారని.. సీనియర్ ఐఏఎస్‌తో విచారణ జరిపిస్తున్నామన్నారు.