మాధవీ లతకు జేసీ క్షమాపణలు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎట్టకేలకు దిగొచ్చారు. సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లతకు ఆయన క్షమాపణలు చెప్పారు. ‘సినీ నటి మాధవీ లత గురించి ఆవేశంలో అలా మాట్లాడటం తప్పే. ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను. 72 సంవత్సరాల వయసున్న నేను ఆవేశంలో అలా మాట్లాడానే తప్ప.. కించపరచాలనే ఉద్దేశం లేదు’ అని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇక జేసీ, మాధవీ…
ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన కోసం పటిష్ఠమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేవల్ వైమానిక స్థావరం ఐఎన్ఎస్ డేగాకు మోడీ చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ జరిగే ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండుకు చేరుకుంటారు. దత్త ఐలాండ్ నుంచి ఏయూ గ్రౌండ్ వరకు భారీ రోడ్ షో నిర్వహించే విధంగా షెడ్యుల్ ఫిక్స్ అయింది. 60…
ప్రధాని బహిరంగ సభపై ప్రభుత్వం ఫోకస్: ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన కోసం పటిష్ఠమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేవల్ వైమానిక స్థావరం ఐఎన్ఎస్ డేగాకు మోడీ చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ జరిగే ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండుకు చేరుకుంటారు. దత్త ఐలాండ్ నుంచి ఏయూ గ్రౌండ్ వరకు భారీ రోడ్ షో నిర్వహించే…
రెండు లక్షల మందితో ప్రధాని మోడీ సభ ఏర్పాట్లను నేడు మంత్రి నారా లోకేష్ సమీక్షించనున్నారు. మోడీ రోడ్ షోను ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం తోట కళ్యాణ మండపంలో నేడు శ్రీ రంగనాథ కోదాడ దేవి కళ్యాణం జరగనుంది. నేడు హోంమంత్రి వంగలపూడి అనిత సెంట్రల్ జైలును సందర్శించనున్నారు. ఇటీవల జైల్లో జరుగుతున్న పరిణామాలపై పరిశీలన చేయనున్నారు. నేటితో ప్రపంచ తెలుగు మహాసభలు ముగియనున్నాయి. ముగింపు వేడులకు సీఎం రేవంత్…
Mid Day Meal In Colleges: ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుండి మధ్యాహ్న భోజనం అందించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ హయాంలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు ఈ పథకం ప్రారంభచనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో 1,48,419 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. విజయవాడ పాయకాపురం నుండి మంత్రి లోకేశ్…
కర్ణాటక బస్సులో ఏపీ మంత్రుల ప్రయాణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నేడు బెంగళూరులో పర్యటిస్తోంది. కర్నాటక మంత్రులు, అధికారులతో ఈ పధకం అమలు జరుగుతున్న తీరును సబ్ కమిటీ తెలుసుకుంటోంది. బెంగళూరులో ప్రధాన డిపోలను కమిటీ పరిశీలిస్తోంది. ఈ క్రమంలో ఏపీ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యారాణిలు కర్ణాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. సాయంత్రం 5 గంటలకు సీఎం సిద్దరామయ్యను ఏపీ మంత్రుల…
సన్నాహక విన్యాసాల్లో అపశ్రుతి: విశాఖపట్నం తీరంలో జరిగిన నేవీ సన్నాహక విన్యాసాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం (జనవరి 4) జరగనున్న నౌకాదళ వేడుకల సందర్భంగా.. అధికారులు గురువారం పూర్తిస్థాయి సన్నాహక విన్యాసాలు నిర్వహించారు. విమానాల నుంచి ప్యారాచూట్ల ద్వారా నావికులు దిగుతున్న క్రమంలో.. గాలి అనుకూలించకపోవడంతో రెండు ప్యారాచూట్ల ఒకదానికొకటి చిక్కుకున్నాయి. దీంతో పట్టుకోల్పోయిన ఇద్దరు నావికులు సముద్రంలో పడిపోయారు. అప్పటికే విశాఖ సముద్రంలో ఉన్న జెమినీ బోట్ల సిబ్బంది.. ఇద్దరు నావికులను రక్షించి ఒడ్డుకు చేర్చారు.…
నేడు గుంటూరులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించనున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీలో అఖిలభారత, అవయవ దాతల సంఘం ఐదవ మహాసభకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరుకానున్నారు. ఈరోజు నారావారిపల్లెలో ఎమ్మెల్యే పులివర్తి నాని జాబ్ మేళ నిర్వహించనున్నారు. ఇవాళ రెవెన్యూ, రిజిస్ర్టేషన్, స్టాంప్స్ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ సమక్షంలో సీసీఎల్ఏ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు మంగళగిరి సీసీఎల్ఏ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు…
నేటి నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం: నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం ఆరంభం కాబోతోంది. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం (వీబీఎఫ్ఎస్) ఆధ్వర్యంలో జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 11 రోజుల పాటు పుస్తక ప్రదర్శన కొనసాగనుంది. విజయవాడ బుక్ ఎక్జిబిషన్కు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సర్వం సిద్ధమైంది. 35వ పుస్తక మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు పుస్తక మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభిస్తారు.…
ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఎస్ఐపీబీ అమోదించిన లక్ష 80 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ అమోదం తెలపనుంది. సమావేశం తర్వాత మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. కొత్త ఏడాదిలో మంత్రులకు కొత్త టార్గెట్లను విదించనున్నారు. నేడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పుస్తక మహోత్సవం ఆరంభం కానుంది. విజయవాడ బుక్ ఎక్జిబిషన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఇవాల్టి నుంచి 11రోజుల పాటు పుస్తక ప్రదర్శన జరగుతుంది. ఇవాళ…