వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీకి సంబంధించి టీటీడీ తోపాటు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిందని… అయినా అనుకోకుండా ఈ ఘటన జరిగిందని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. తిరుపతిలోని రూయా ఆసుపత్రిలో మార్చురీని ఆయన వైద్య అధికారులతో కలిసి పరిశీలించారు. మృతదేహాలకు సత్వరమే పోస్టుమార్టం నిర్వహించి వారి స్వస్థలాలకు పంపుతామని కలెక్టర్ వెల్లడించారు. ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో 2 వేల 400 మంది భక్తులు ఉన్నారని… ఒకసారిగా గేట్లు తెరవడంతోనే ఈ ఘటన జరిగిందని ఆయన అన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. మృతుల కుటుంబ సభ్యులను… గాయపడిన వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శిస్తారన్నారు.
READ MORE: Restrictions On Media: మీడియాపై ఆంక్షలు పెట్టిన ఇజ్రాయెల్.. ఎందుకో తెలుసా..?
కాసేపట్లో ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు.. తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీరు, లోపాలపై అధికారులతో చర్చించనున్నారు. సమావేశం తర్వాత తిరుపతి వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 3గంటలకు తిరుపతికి వెళ్లనున్నారు.. తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిని పరామర్శించనున్నారు. ఇదిలా ఉండగా.. తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఈవో శ్యామల రావు స్పందించారు. ఆరుగురు మృతి చెందినట్లు తెలిపారు.. 41 మంది భక్తులు గాయపడ్డారు.. 20 మంది భక్తులను డిశ్చార్జ్ చేశాం.. ఒకరిద్దరు మాత్రమే రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని టీటీడీ ఈవో చెప్పారు.
READ MORE: AP BJP: నీ దర్శనానికి వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేయలేనందుకు మమ్ములను క్షమించండి స్వామీ..