ఐదేళ్లలో కుప్పాన్ని ఊహించని రీతిలో అభివద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ద్రవిడ యూనివర్శిటీలో ‘స్వర్ణ కుప్పం-విజన్ 2029’ డాక్యుమెంట్ను చంద్రబాబు విడుదల చేసి మాట్లాడారు. త్వరలో కుప్పాన్ని స్వచ్ఛ కుప్పంగా మారుస్తామని తెలిపారు. అన్‌స్టాపబుల్‌గా కుప్పం అభివద్ధి చెందుతోందని పేర్కొన్నారు. త్వరలో కుప్పంలో విమానాశ్రయానికి కూడా శంకుస్థానం చేస్తామన్నారు. ఈ మధ్య డబ్బు పెరగడంతో కొన్ని జంటలు పిల్లల్ని కనకుండా ఎంజాయ్ చేయడానికి చూచేస్తున్నారని వ్యాఖ్యానించారు. మీ తల్లిదండ్రులు కూడా అలా అనుకుంటే మీరు పుట్టేవారా? అని ప్రశ్నించారు. జనాభా పెరుగుదల ప్రస్తుతం చాలా అవసరం అని తెలిపారు. ప్రతి జంట ఇద్దరు పిల్లల్ని కనేలా చూసుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Redmi 14C: 50MP డ్యూయల్ కెమెరాతో బడ్జెట్ ఫోన్‌ను రిలీజ్ చేయనున్న రెడీమి
150కు పైగా సేవలను పొందే వాట్సప్, ఆన్‌లైన్ ద్వారా పొందే విధంగా యాప్‌ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఇంటిలోనూ ఒక పారిశ్రామికవేత్త పుట్టుకురావాలని పిలుపునిచ్చారు. అలా వచ్చేలా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఏఐ ద్వారా కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చని.. సీఎం పేరు, పీఎం పేరు సహా ఏ సమాచారం కావాలన్నా ఏఐ ఇస్తుందన్నారు. ప్రతి జిల్లాకు ఒక విజన్ రూపొందిస్తామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వేలాది ఎకరాలు దోచుకున్నారని విమర్శించారు. తనకు వచ్చిన ఫిర్యాదుల్లో 60 శాతం భూ సమస్యలపైనేనని చంద్రబాబు తెలిపారు.
ఇది కూడా చదవండి: Kannappa : కన్నప్ప అప్ డేట్.. పార్వతీదేవీగా చందమామ