Tirupati: విష్ణు నివాసం దగ్గర తీవ్ర తొక్కిసలాట.. నలుగురు భక్తులు దుర్మరణం
- తిరుపతి విష్ణు నివాసం దగ్గర తొక్కిసలాట
- నలుగురు భక్తులు దుర్మరణం.. పలువురి పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి విష్ణు నివాసం దగ్గర తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల కోసం భారీగా భక్తులు పోటెత్తారు. దీంతో తీవ్ర తొక్కిసలాట జరగడంతో నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు భక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జనవరి 10, 11,12 తేదీల్లో వైకుంఠ దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులకు 1.20 లక్షల టోకెన్లను గురువారం ఉదయం నుంచి టీటీడీ జారీ చేస్తోంది. ఇందుకోసం బుధవారమే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఒకేసారి భక్తులను వదలడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది.
గురువారం ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా వైకుంఠ దర్శనం టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అయితే టోకెన్ల కోసం బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలైన్లలోకి భక్తులను ఒక్కసారిగా వదలడంతో తోపులాట జరిగింది. తొక్కిసలాటలో గాయపడిన భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. తోపులాట జరిగిన ప్రాంతాలకు విజిలెన్స్, పోలీసు బలగాలు భారీగా చేరుకున్నారు.
Also Read
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
సమాచారం అందుకున్న టీడీడీ ఈవో శ్యామల రావు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. పోలీసులతో కలిసి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..