తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. క్షతగాత్రులు పద్మావతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. వారిని ఈవో శ్యామలరావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారని.. 41 మందికి గాయాలయ్యాయని తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీకి సంబంధించి టీటీడీ తోపాటు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిందని... అయినా అనుకోకుండా ఈ ఘటన జరిగిందని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన ఘటన భక్తుల్లో కలకలాన్ని రేపింది. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారు.. 41 మంది భక్తులు గాయపడ్డారు.. 20 మంది భక్తులను డిశ్చార్జ్ చేశాం.. ఒకరిద్దరు మాత్రమే రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని టీటీడీ ఛైర్మన్ శ్యామల రావు అన్నారు. కాగా.. మృతులు విశాఖకు చెందిన జి. రజనీ(47), లావణ్య (40), శాంతి (34), తమిళనాడుకు…
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన ఘటన తిరుపతి వాసుల్లో కలకలాన్ని రేపింది. తాజాగా ఈ అంశంపై ఏపీ బీజేపీ స్పందించింది. "ఏడు కొండలు వాడా... స్వామి మమ్ముల్ని క్షమించు... భక్తకోటిని క్షమించండి. నీ దర్శనానికి వచ్చిన వారికి ఏర్పాట్లు చేయలేనందుకు మమ్ములను క్షమించు." అని కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని క్షమాపణలు కోరింది.
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించిన విషయం తెలిసిందే. మరో 48 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా రుయా ఆస్పత్రి నుంచి 8 మందిని స్విమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం స్విమ్స్ ఆస్పత్రిలో 16 మంది భక్తులకు చికిత్స అందిస్తున్నారు. 32 మంది భక్తులు డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా… ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
తిరుపతి విష్ణు నివాసం దగ్గర విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల కోసం భారీగా భక్తులు పోటెత్తారు. దీంతో తీవ్ర తొక్కిసలాట జరగడంతో ఒక భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది.
ఐదేళ్ల కుప్పాన్ని ఊహించని రీతిలో అభివద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ద్రవిడ యూనివర్శిటీలో ‘స్వర్ణ కుప్పం-విజన్ 2029’ డాక్యుమెంట్‌ను చంద్రబాబు విడుదల చేసి మాట్లాడారు. త్వరలో కుప్పాన్ని స్వచ్ఛ కుప్పంగా మారుస్తామని తెలిపారు.
యువకుల మృతి బాధాకరం: ఇటీవల రాజమహేంద్రవరంలో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడీబీ రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి చాలా బాధాకరం అని పేర్కొన్నారు. జనసేన పార్టీ తరఫున బాధితుల కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు. గత ఐదేళ్లలో కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య ఏడీబీ రోడ్డును ఎవరూ పట్టించుకోలేదని, ఇక…
చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద తిరుమల శ్రీవారి భక్తులపైకి అంబులెన్స్ (108 వాహనం) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పుంగనూరు నుంచి తిరుమలకు కాలినడకన వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ (40), లక్ష్మమ్మ (45)గా గుర్తించారు. అంబులెన్స్…
నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మూడు రోజులపాటు సొంత నియోజకవర్గంపై సీఎం ఫోకస్ చేయనున్నారు. ఈరోజు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఇవాళ ఏపీకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రానున్నారు. సాయంత్రం 5:30 గంటలకు బెంగుళూరు నుంచి గన్నవరం విమానాశ్రయంకు…