తిరుమల తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. “నెల రోజులుగా రోజుకో సమీక్ష పేరుతో వైకుంఠ ఏకాదశికి చేశారు.. పనిచేసేవాళ్ళు తక్కువై పోయారు. పర్యవేక్షించే వారు ఎక్కువై పోయారు. వ్యవస్థను పూర్తి గా వైఫల్యం చెందించారు. టీటీడీ, పోలీసులు, టీటీడీ నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందారు. క్రైమ్ డీఎస్పీ పద్మావతి పార్క్ లో పశువులు మంద తోలినట్లు భక్తులను తోలారు. గత ప్రభుత్వం హయంలో ఎంతో సమర్థవంతంగా పనిచేశాం. ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా అద్భుతంగా నిర్వహించాం. టీటీడీని రాజకీయ క్రీడా మైదానం గా మార్చారు. మీరు చేస్తున్న తప్పులతో భక్తులకు కష్టాలు తలెత్తాయి. టీటీడీ ఛైర్మన్‌ను కనీసం ఈవో, అడిషనల్ ఈవో పట్టించుకునే పరిస్థితి లేదు. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరీకి చంద్రబాబు సేవ తప్పా, భక్తులు సేవ లేదు. బ్రేక్ దర్శనాలు 7 వేలకు పైగా ఇస్తున్నారు. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి దీనికి పూర్తి బాధ్యత వహించాలి.” అని భూమన వెల్లడించారు.
READ MORE: TTD EO Shyamala Rao: “ఆ వ్యక్తి వల్లే ఘటన జరిగింది?” తొక్కిసలాట ఘటనపై ఈవో క్లారిటీ..
భక్తులు సేవకు 15 మంది పోలీసులు లేరని.. సీఎం చంద్రబాబు వస్తున్నాడు అంటే 2వేలకు పైగా పోలీసులు మోహరించారని భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. “వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులును ఏవిధంగా అరెస్టు చేయించాలి అనే కుట్రలు చేస్తున్నారు. మేము వైకుంఠ ఏకాదశి దర్శనం రెండు రోజులు నుంచి పది రోజులకు పెంచి భక్తులకు అందుబాటులోకి తెచ్చాం. తమిళనాడు శ్రీరంగంలో పదిరోజులు దర్శనం తరహాలో తిరుమలలో అమలు చేశాం. భక్తులకు మేలైన నిర్ణయాలే తీసుకున్నాం. వాటిని మార్చలేరు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి. ఎస్పీ దగ్గర నుంచి కింది స్థాయిలో పోలీసులు, అడిషనల్ ఈవో వెంకన్న చౌదరీన లను సస్పెండ్ చేయాలి.” అని తెలిపారు.
READ MORE: KTR : ఏసీబీ కార్యాలయంకు వెళ్లేముందు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
“సనాతన ధర్మం పరిరక్షిస్తాను అని చెప్పిన పవనానందం స్వామి వారు మాట్లాడాలి. సనాతన ధర్మం కాపాడుత అని చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమి చేస్తున్నారు.గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్ కు వెళ్లి వస్తూ తిరుగు ప్రయాణంలో ఇద్దరు అభిమానులు చనిపోయారు.. రోడ్డు బాలేదని మమ్మల్ని విమర్శిస్తున్నారు. దేవుతో పెట్టుకుంటే ఆయనే చూస్తాడు అంటూ చంద్రబాబు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అదే జరిగింది. లడ్డు ప్రసాదంతో రాజకీయ ఆటలు అదితే స్వామి చూస్తారు. ఈరోజు శ్రీవారి లడ్డు ప్రసాదంలో అపవాదులు జరగడం, రాజకీయ పావుగా వాడుకుంటున్నారు. అందుకే ఈ ఘోరాలు జరుగుతున్నాయి. తిరుమల పవిత్రతను మేము కాపాడినట్లు, ఎవరు చేయలేదు. జగన్ మోహన్ రెడ్డి పై ఏడుపే తప్ప, పాలన లేదని కరుణాకరరెడ్డి అన్నారు. టీటీడీ ఈవోను బదిలీ చేయాలి. ఎస్పీ బదిలీ చేయాలి. చనిపోయిన. బాధితులకు కోటి రూపయలు, బాధితులకు 20 లక్షలు ఇవ్వాలి. ప్రభుత్వం బాధ్యత రాహిత్యంకు నిదర్శనం. క్యులైన్ పర్యవేక్షణ అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి ది , ఆయన్ను అరెస్టు చేయాలి. టీటీడీ ఈవో స్థాయి నుంచి ఎస్పీ అందరిపైనా వేటు వేయాలి.” అని టీటీడీ మాజీ ఛైర్మన్ డిమాండ్ చేశారు.