ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం:
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం అని.. ప్రజల ఆరోగ్యం బాగుంటే వ్యక్తిగత ఆదాయం పెరుగుతుందని, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలో చెత్తను సద్వినియోగం చేసుకునేందుకు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం అని.. నెల్లూరు, కాకినాడ, రాజమహేంద్రవరంలతో పాటు రాయలసీమలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలనేది తమ లక్ష్యం అని మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరు సిటీ పరిధిలోని కిసాన్ నగర్, ఏసీ నగర్లలోని పార్కుల ఆధునికీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
నవ వధువుకు కట్నం వేధింపులు:
విజయవాడలో కట్నం కోసం నవ వధువుకు వేధింపుల పర్వం బయటపడింది. రూ.5 కోట్లు ఇచ్చినా.. పెళ్లైన రెండు రోజులకే కట్నం వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు తాళలేని వధువు భవానీపురం పోలీసులకు కంప్లైంట్ చేసింది. భర్త, మామపై ఐపీసీ సెక్షన్ 498A, వరకట్న నిషేధ చట్టం సెక్షన్ 3,4 ల కింది కేసు నమోదు చేసి పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. తండ్రీ కొడుకులకు 14 రోజుల రిమాండ్ విధించి.. నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపించారు. చెరుకూరి లక్ష్మణరావు విజయవాడ ఆర్టీసీలో కంట్రోలర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు హేమంత్ అజయ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కర్ణాటక రాయచూర్‌లోని ఏక్లాస్పూర్ చౌదరీస్ కాలనీలో ఉండే వెలిసేటి ప్రసన్నకుమార్ చౌదరి పెద్ద ఆసామి (180 ఎకరాలు). ఆయన కుమార్తె లక్ష్మి కీర్తన చౌదరికి అజయ్‌తో పెళ్లి నిశ్చయించారు. కూతురు సుఖపడుతుందని వివాహానికి ముందు నగదు, స్థిరాస్థులు, బంగారం, వెండి మొత్తం కలిపి సుమారు రూ.5 కోట్లు కట్నంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈనెల 7న రాయచూర్‌లో కీర్తన, అజయ్ పెళ్లి ఘనంగా జరిగింది. వివాహం జరిగిన రెండు రోజులకు లక్ష్మి కీర్తన చౌదరికి కట్నం వేధింపులు మొదలయ్యాయి. మరో రూ.50 లక్షలు తేవాలని అజయ్, లక్ష్మణరావు వేధించారు. కట్నం కోసం నవ వధువును తండ్రి, కొడుకులు బంధించారు. అనంతరం భవానీపురం పోలీసు స్టేషనులో నవవధువు కీర్తన కంప్లైంట్ చేసింది.
తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు:
వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వేద ఫంక్షన్ హాల్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తన ప్రసంగంలో ఈ ఎన్నికల్లో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల స్థానం బీజేపీ ఖాతాలో పడతాయని ధీమా వ్యక్తం చేశారు. మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రజలు బీఆర్ఎస్‌పై వ్యతిరేకతతో కాంగ్రెస్‌ను గెలిపించారని, కానీ వారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని ఆరోపించారు.
కూతురిని ప్రేమిస్తున్నాడని యువకుడిని హత్య చేసిన తండ్రి:
సంగారెడ్డి జిలా నిజాంపేట మండలం ఈదులతండా శివారులో ఘోరమైన హత్య ఘటన చోటుచేసుకుంది. కూతురిని ప్రేమిస్తున్నాడనే కారణంతో ఓ తండ్రి యువకుడిని పాశవికంగా హత్య చేసి అతని శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసిన ఘటన చోటు చేసుకుంది. నిజాంపేట మండలానికి చెందిన దశరథ్ (26) హత్యకు గురైన బాధితుడు. అతను నిందితుడు గోపాల్ కుమార్తెతో సన్నిహితంగా ఉండటాన్ని గోపాల్ సహించలేకపోయాడు. దీంతో అతనిపై కోపంతో దాడి చేసి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో పడేసాడు.
మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే:
వరంగల్ నగర అభివృద్ధికి సహాయం చేయాలని కోరుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కలిశారు. కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం వేద బ్యాంక్వెట్ హాల్ వద్ద ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. వరంగల్ నగర అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కోరానని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పాటు, అదనంగా కేంద్రం కూడా నిధులు కేటాయించాలని ఆయన కోరారు. వరంగల్ నగరంలో స్మార్ట్ సిటీ పనులకు కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలిని కోరారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే మంజూరు చేయాలని కోరారు.
నేడు ‘ఆది మహోత్సవ్’ను ప్రారంభించనున్న రాష్ట్రపతి:
ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో మెగా జాతీయ గిరిజన పండుగ ‘ఆది మహోత్సవ్’ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తున్న ఆది మహోత్సవ్ ఫిబ్రవరి 16-24 వరకు మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం ఫిబ్రవరి 16 నుండి 27 వరకు ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియంలో నిర్వహించబడుతోంది. ప్రధానమంత్రి కార్యాలయం ప్రకారం వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లు దేశవ్యాప్తంగా ఉన్న తెగల గొప్ప, విభిన్న వారసత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఇండోనేషియా, శ్రీలంక నుండి ప్రతినిధులు కూడా ఆది మహోత్సవంలో పాల్గొంటారు. ఈ ఉత్సవంలో 600 మందికి పైగా గిరిజన కళాకారులు, 500 మంది ప్రదర్శన కళాకారులు, 30 కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి విభిన్న సంప్రదాయాలను సూచించే 25 గిరిజన ఆహార దుకాణాలు ఉంటాయి.
సేమ్ కాంబో రిపీట్ చేస్తున్న దర్శకుడు పూరి:
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు తెలుగు స్టార్ హీరోలందరి కెరీర్‌కి మంచి కంమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని అప్పట్లో అగ్ర హీరోలంతా కోరుకునేవారు. కానీ ప్రజెంట్ అతనికి బ్యాడ్ టైం నడుస్తుంది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి రెండు బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా డిజాస్టర్ అందుకున్న పూరీ నెక్స్ట్ మూవీ ఏంటి.. ఏ హీరోతో చేస్తారనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం పూరి తదుపరి చిత్రం గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. అవును రీసెంట్‌గా పూరి టాలీవుడ్ ట్యాలెంటేడ్ హీరో గోపీచంద్ కోసం ఓ కథపై చర్చలు జరిపినట్లు టాలీవుడ్ సమాచారం. ఈ సినిమాకి పూరి కేవలం స్టోరీ, డైలాగ్స్ మాత్రమే అందిస్తాడని, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం పాత స్టైల్‌ను ఫాలో అవుతాడని టాక్. ఇక వీరిద్దరి కాంబోలో 2010లో వచ్చిన ‘గోలీమార్’ మూవీ అంత చూసే ఉంటారు. ఇప్పుడు తిరిగి 15 ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
కాంచన 4ను పట్టాలెక్కించిన లారెన్స్:
హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి ఇటు హీరోగా అటు దర్శకుడిగా పాపులరయ్యాడు రాఘవ లారెన్స్. ముని2తో మొదలైన కాంచన ఫ్రాంచైజీ నుండి ఇప్పటి వరకు మూడు పార్ట్స్ రాగా, ఇప్పుడు ఫోర్త్ ఇన్ స్టాల్ మెంట్ మూవీని ప్రిపేర్ చేస్తున్నాడు. రీసెంట్లీ కాంచన 4 సెట్స్ పైకి వెళ్లింది. ఈ విషయాన్ని నిర్మాత మనీష్ వెల్లడించాడు. కాంచన 4లో ఫీమేల్ లీడ్ గా పూజా హెగ్డే నటిస్తుండగా ఇప్పుడు మరో హీరోయిన్ కన్ఫమ్ అయ్యింది. బాలీవుడ్ ఐటం బాంబ్ నోరా ఫతేహీ మరో కీ రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవుతుంది అని ఎప్పటో నుండో వార్తలు వస్తున్న కూడా ఇప్పటి వరకు స్టార్ కాలేదు. తాజాగా ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేసాడు రాఘవ లారెన్స్. కాంచన మునుపటి సిరీస్ ల కంటే కాంచన 4ను అత్యంత భారీగా దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు లారెన్స్. కాంచననే కాకుండా శివలింగ, చంద్రముఖి2 వంటి సెపరేట్ హారర్ జోనర్ చిత్రాల్లోనూ నటించాడు లారెన్స్. అలాగే కాంచనను లక్ష్మీ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ కీ రోల్స్ చేసిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరీ కాంచన 4ను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరీ అక్కడి ప్రేక్షకులను ఈ ఫ్రాంచైజీ మూవీకి కనెక్ట్ అవుతారో లేదో రానున్న రోజుల్లో తెలుస్తుంది.
ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు:
డబ్బుంటేనే అందరికీ మీరు అవసరం లేకపోతే ఎవరూ పట్టించుకోని పరిస్థితులు వచ్చేశాయ్. అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే అంతా డబ్బు సంపాదన కోసం పరుగెడుతున్నారు. వచ్చిన సంపాదనను వివిధ రూపాల్లో ఇన్వెస్ట్ చేసి లాభాలు అందుకోవాలని చూస్తున్నారు. అయితే పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలున్నాయి. వీటిల్లో పోస్టాఫీస్ అందించే స్కీమ్స్ బెస్ట్ అంటున్నారు నిపుణులు. పెట్టుబడి భద్రంగా ఉంటుంది. గ్యారంటీ రిటర్స్న్ అందుకోవచ్చు. అయితే ప్రతి నెల ఆదాయం కావాలనుకునే వారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్ బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్ గా చెప్పొచ్చు.
కేవలం రూ. 7999లకే ఇన్ని ఫీచర్లా:
పోకో తన కొత్త ఎంట్రీ లెవల్ 5G స్మార్ట్‌ఫోన్ పోకో C75 5G ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎక్కువగా మొబైల్ ఉపయోగించే వారికి ఇది మంచి ఎంపికగా ఉంటుంది. భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీ, 5G కనెక్టివిటీతో పాటు, ఆకర్షణీయమైన డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ముఖ్యంగా ఎనిమిది వేల కంటే తక్కువ ధరలో లభించడం ఈ ఫోన్‌కి అదనపు ఆకర్షణ. పోకో C75 5G 4GB RAM + 64GB స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 7999. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5% క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుందండోయ్.. ఈ ఫోన్ సిల్వర్ స్టార్ డస్ట్, ఆక్వా బ్లిస్, ఎన్‌ఛాంటెడ్ గ్రీన్ రంగులలో అందుబాటులో ఉంది.