ఏపీఎస్ఆర్టీసీకి బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. చైర్మన్‌గా కొనకళ్ల నారాయణ సహా ఆరుగురు నామినేటెడ్ సభ్యులు, 11మంది అధికారులతో ఆర్టీసీ బోర్డును ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఎండీ, ఆర్థిక, రవాణా, సాధారణ పరిపాలన శాఖ, ఇతర శాఖలు, విభాగాల ఉన్నతాధికారులతో బోర్డు ఏర్పాటు జరిగింది. బోర్డులో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం వహించేలా అధికారులు ఏర్పాటు చేశారు. రెండేళ్ల పాటు ఆర్టీసీ వ్యవహారాలను పర్యవేక్షించేలా బోర్డును ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: Exit Polls Time : ఈసారి ఢిల్లీలో ఎవరి ప్రభుత్వం రాబోతుంది.. ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?