అల్లూరి జిల్లా పాడేరు సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డుపై వెళుతుండగా ఒక్కసారిగా కారు అదుపతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో భార్యాభర్తలతో సహా ముగ్గురు మృత్యువాత పడ్డారు.
ఏపీలో అవినీతి అధికారులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. సబ్ రిజిస్టర్ , ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేసింది. పలువురు అవినీతి అధికారులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. పలు డాక్యుమెంట్లు , లక్షల్లో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాల్లో బుధవారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ఏపీ ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్ ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కృష్ణా జిల్లా సత్తా చాటింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా కృష్ణా నిలిచింది.
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను మంత్రి విడుదల చేశారు.
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల కాస్త ఆలస్యం కానుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ సాయంత్రం 5 గంటలకు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్లో అనంతపురం జిల్లాలోని నార్పల నుంచి పుట్టపర్తికి వెళ్లాల్సి ఉండగా.. సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది.
టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శల దాడి చేశారు. చంద్రబాబు పురుషాధిక్య అభిప్రాయాలు కలిగిన వ్యక్తి అని.. ఆయన వల్ల మహిళలకు ఏనాడూ మంచి జరగలేదని అన్నారు.