AP CM Jagan: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్.జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. స్పందన, జగనన్నకు చెబుదాం, పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం, నాడు – నేడుపై సీఎం సమీక్షించారు. మే 9న ప్రతిష్ఠాత్మకంగా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ప్రారంభిస్తామని.. దీని కోసం 1902 హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశామని వెల్లడించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి నా పేరును కలిపారని.. అంటే ఈ కార్యక్రమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంతో ఇట్టే అర్థం అవుతుందన్నారు. స్పందనకు మరింత మెరుగైన రూపమే ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమమని చెప్పారు.
Read Also: AP Amaravti Jac : జీపీఎఫ్‌పై వడ్డీ ఆర్ధిక శాఖ కార్యదర్శి జీతం నుంచి చెల్లించాలి
నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే ‘జగనన్నకు చెబుదాం’ అని.. ఇండివిడ్యువల్ గ్రీవెన్సెస్‌ను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే దీని ఉద్దేశమన్నారు. హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తే.. దానిని అత్యంత నాణ్యతతో పరిష్కరించాలన్నారు. సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్ యూనిట్లు ఉంటాయన్నారు. ఈ యూనిట్లను కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్ చేయాలన్నారు. ” గ్రీవెన్స్ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలి. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యం. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లను సీఎంఓ కూడా పర్యవేక్షిస్తుంది. హెల్ప్‌లైన్‌ద్వారా గ్రీవెన్స్ వస్తాయి. వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలి. గ్రీవెన్స్ ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇండివిడ్యువల్, కుటుంబం స్థాయిలో గ్రీవెన్సెస్. రిజ్టసర్ అయిన గ్రీవెన్సెస్ ఫాలో చేయడం, ప్రభుత్వ సేవలు, పథకాలపై ఎంక్వైరీ, ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయడం అన్నది జగనన్నకు చెబుదాం ప్రధాన కార్యక్రమాలు.” అని సీఎం జగన్ వెల్లడించారు.
అమలు ఇలా ..
– ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్ అయి ఉంటారు:
– వారి గ్రీవెన్స్‌స్‌ను సలహాలను నేరుగా తెలియజేయవచ్చు:
– ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం ఈ గ్రీవెన్స్‌స్‌ను నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా చూస్తుంది:
– ఐవీఆర్ఎస్, ఎస్‌ఎంఎస్ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు రెగ్యులర్ అప్‌డేట్స్ అందుతాయి:
– అంతేకాక ఇదే హెల్ప్‌లైన్ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులనుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటుంది:
– గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్ గురించి అవగాహన కల్పిస్తారు.
– ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకునేలా వారిని మరింతగా ప్రోత్సహిస్తారు:
– జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమల్లో మూడు కీలక యంత్రాంగాల ఉంటాయి:
– సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకూ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు ఉంటాయి.
– ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారులుప్రత్యేకాధికారులుగా ఉంటారు:
– క్రమం తప్పకుండా ఆయా జిల్లాలను వీరు సందర్శించి పర్యవేక్షిస్తారు:
– ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను పర్యవేక్షిస్తారు.
– కలెక్టర్లతో కలిపి… జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారు.
– సమస్యల పరిష్కారాల తీరును రాండమ్‌గా చెక్‌చేస్తారు.
– ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల పనితీరును పర్యవేక్షిస్తారు.
– ఎక్కడైనా సమస్య పరిష్కారం పట్ల సంతృప్తి లేకపోతే.. దాన్ని తిరిగి ఓపెన్ చేస్తారు.
– ఎస్‌ఎంఎస్, ఐవీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా దాన్ని తిరిగి తెరుస్తారు.
– పరిష్కార తీరుపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తారు.
– చీఫ్‌సెక్రటరీ, సీఎంఓ, డీజీపీతో కలిసి రెగ్యులర్‌గా మానిటర్ చేస్తారు.
– ప్రతి 15 రోజులకోసారి పూర్తిస్థాయిలో సమీక్ష ఉంటుంది:
– ప్రతి కలెక్టర్‌కు రూ.3 కోట్ల రూపాయలను తక్షణ నిధులుగా ప్రభుత్వం ఇస్తుంది:
– అవసరమైన చోట.. ఈ డబ్బును ఖర్చు చేయవచ్చు :
– వీటిని ఖర్చు చేసే అధికారం కలెక్టర్‌కు ఇస్తున్నాం:
– దీనివల్ల వేగవంతంగా గ్రీవెన్స్‌స్ పరిష్కారంలో డెలివరీ మెకానిజం ఉంటుంది:
– అంతేకాకుండా… గ్రామ స్థాయిలోని సచివాలయాలు, ఆర్బీకేలు, అంగన్‌వాడీలు, విలేజ్‌క్లినిక్స్.. అవన్నీకూడా సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్న అంశంపైన కూడా దృష్టిపెడతారు. ఇవి సక్రమంగా పనిచేస్తే… చాలావరకు సమస్యలు సమసిపోతాయి: