టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తీవ్రమైన వ్యాఖ్యలతో మండిపడ్డారు. రైతుకు వ్యవసాయం దండగ అన్న నీచుడు చంద్రబాబు అంటూ సీరియస్ అయ్యారు.
విద్యను ముగించుకొని ఇంటికి వెళ్ళబోతున్న విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీ అధికారులు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బకాయి ఉన్న ఫీజులను చెల్లిస్తేనే ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని చెప్పడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా కింద లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధులను విడుదల చేశారు.
విద్యను ముగించుకొని ఇంటికి వెళ్ళబోతున్న విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నూజివీడు , శ్రీకాకుళం , ఇడుపులపాయ , ఒంగోలు క్యాంపస్‌లలో ఫీజులు చెల్లించని 4వేల మంది ఆఖరి ఏడాది పూర్తి చేసుకున్న విద్యార్థులకు ధ్రువపత్రాలను ఆర్జీయూకేటీ నిలిపివేసింది. విద్యా దీవెన , వసతి దీవెన పథకాల ద్వారా తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయినా ఫీజులను తల్లిదండ్రులు చెల్లించలేదు.
ఏపీఎస్ ఆర్టీసీ వినూత్న ప్రయోగం చేపట్టింది. ఒకే టికెట్‌పై రెండు బస్సుల్లో ప్రయాణించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. దూరప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ కొత్తగా మల్టి సిటీ జర్నీ రిజర్వేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
ఏపీ ప్రభుత్వం కొత్తగా పెళ్లి చేసుకున్నవారికి ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయింది. పేద కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద శుక్రవారం అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగదు జమ చేయనున్నారు.
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్.జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. స్పందన, జగనన్నకు చెబుదాం, పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం, నాడు – నేడుపై సీఎం సమీక్షించారు.
సీఎం కాన్వాయ్‌ను రైతులు అడ్డుకునే ప్రయత్నం చేయడం పక్కా ప్లాన్‌తో జరిగిందని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. తుంపర్తి, మోటమర్ల వద్ద భూసేకరణ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని.. అప్పట్లో ఎకరాకు 5 లక్షల పరిహారంగా నిర్ణయించి ఆ డబ్బు కోర్టులో డిపాజిట్ చేశారన్నారు.
టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. చంద్రబాబు సత్తెనపల్లి సభ అట్టర్‌ఫ్లాప్ అయిందని కామెంట్స్ చేశారు. కానీ ప్రచారం మాత్రం ఆర్భాటంగా చెప్పుకున్నారన్నారు. సత్తెనపల్లి సభకు జనం రాకపోయినా అద్భుతం అనడం చంద్రబాబు ఖర్మ అంటూ విమర్శలు గుప్పించారు.