టీడీపీ రాజకీయం కోసం పరిశ్రమల సదస్సులు నిర్వహించిందని.. వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం సమ్మిట్ నిర్వహిస్తోందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల నుంచి తమ టార్గెట్ ప్రారంభం అవుతుందన్నారు.
మాటల కంటే చేతలు ముఖ్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జగన్ అంటేనే విద్యాలయాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. నాడు నేడు పథకంలో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా మంచి విద్య అందేలా స్కూళ్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను చంద్రబాబు మర్యాద పూర్వకంగా కలిశారు.
ఆనం రామనారాయణ రెడ్డికి పిచ్చి ముదిరిందని వైసీపీ నేత నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి అన్నారు. తనను రాజ్యాంగేతర శక్తి అని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంశం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ ఏకంగా పార్టీ అధిష్ఠానంపై ఆయన ఆరోపణలు చేశారు.