APSRTC: ఏపీలో మల్టీసిటీ జర్నీ రిజర్వేషన్.. ఒకే టికెట్‌పై రెండు బస్సుల్లో ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ వినూత్న ప్రయోగం చేపట్టింది. ఒకే టికెట్‌పై రెండు బస్సుల్లో ప్రయాణించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. దూరప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్టీసీ కొత్తగా మల్టి సిటీ జర్నీ రిజర్వేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ‘మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్’ పేరిట తీసుకొచ్చిన ఈ విధానంలో ఒకే టికెట్‌పై రెండు బస్సుల్లో ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ప్రయాణికుడు చేరుకోవాల్సిన గమ్యస్థానానికి నేరుగా బస్సు లేనప్పుడు మధ్యలో ఓ ప్రాంతంలో దిగి అక్కడి నుంచి మరో బస్సులో ప్రయాణించి వెళ్లాల్సిన చోటుకు చేరుకోవచ్చు.
Read Also: One Side Love : వన్ సైడ్ లవ్ యువతి ప్రాణం తీసిందిగా
Also Read
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
రెండు బస్సుల్లో ప్రయాణానికి ఒకేసారి ముందస్తుగా ఆర్టీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. రాయితీలు యథాతథంగా వర్తిస్తాయని, ఎలాంటి మార్పు ఉండదని అధికారులు తెలిపారు. తొలి బస్సు నుంచి దిగిన తర్వాత 2 నుంచి 22 గంటల వ్యవధిలో రెండో బస్సు ఎక్కి ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపారు. తొలి దశలో 137 దూర ప్రాంత బస్సు రూట్లలో ఈ విధానం అమలు చేస్తున్నట్టు తెలిపారు. యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా కానీ, ఆర్టీసీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కానీ రిజర్వేషన్లు చేసుకోవచ్చు. ఒకటి రెండు రోజుల్లోనే దీనిని ప్రారంభించనున్నారు. కాగా, ‘మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్’ను అందుబాటులోకి తీసుకొస్తున్న తొలి సంస్థగా ఏపీఎస్ఆర్టీసీ రికార్డులకెక్కనుంది.
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!