సత్యసాయి జిల్లా కదిరి రైల్వే స్టేషన్ వద్ద.. నాగర్ కోయిల్-ముంబయి రైలు వచ్చే సమయంలో గేట్మెన్ గేటు వేయలేదు. అది గమనించని వాహనాదారులు అలానే రైల్వ్ ట్రాక్ దాటుతున్నారు. ఇంతలోనే ట్రైన్ దగ్గరికొస్తుంది. అది గమనించిన లోకో పైలట్ అప్రమత్తతతో వెంటనే రైలును ఆపేశాడు. దీంతో వాహనాదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గేట్మెన్ నిర్లక్ష్యంపై అటు వాహనాదారులు, స్థానికులు తీవ్రంగా ఫైరవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ ఏర్పాటుపై కసరత్తులు చేస్తుంది. ఈ ఏడాది జూలై నుంచి కొత్త పీఆర్సీ ఉద్యోగులకు అమల్లోకి రావాల్సి ఉంది. ఇప్పటికే కొత్త పీఆర్సీ కమిటీ కోసం ప్రభుత్వానికి విఙప్తి చేస్తున్నారు సచివాలయం ఉద్యోగుల సంఘం సహా ఇతర ఉద్యోగ సంఘాలు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్నినాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ (శుక్రవారం) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఆ రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై స్పందించిన పేర్ని నాని.. రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఎందుకు శుభాకాంక్షలు చెప్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పారా అని అడిగారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ నవంబర్ 1న మాత్రమేనని చంద్రబాబుకు పేర్ని గుర్తుచేశారు.
ఏపీలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ పోలవరంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక ప్రకటన చేశారు. త్వరలో రూ. 12 వేల కోట్లకు పైగా నిధులు పోలవరం కోసం ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు.పోలవరం నిర్మాణం కోసం రూ. 12, 911 వేల కోట్లను కేంద్రం ఇవ్వబోతోందని ఆయన తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా-2లో భాగంగా.. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్ర స్ధాయి పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
వరుసగా ఐదో సారి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున సహాయాన్ని విడుదల చేశారు. 52.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. మొత్తం రూ.3వేల 900 కోట్లకు పైగా నిధులు జమ చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన దానికంటే ఎక్కువగా రైతు భరోసా ఇస్తున్నామని కర్నూలు జిల్లాలో పత్తికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అన్నారు.
నేటి నుంచి ఏపీలో వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీని ప్రభుత్వం చేపట్టనుంది. 63.14 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1739.75 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం పింఛన్ల రూపంలో పంపిణీ చేయనుంది.
చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి నాలుగు లైన్ల జాతీయ రహదారి చెంతనే శుక్ర, శనివారాల్లో ఈ మహానాడును అద్భుతంగా చేపట్డనున్నారు.