Andhrapradesh: ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నేడు అమరావతి సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాలతో సమావేశం కానుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నుంచి తమకు సమాచారం అందినట్లు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
Read Also: Viral : భోజనానికి కూర్చోగానే మొదలైన వాన.. సూపర్ ఐడియా వేసిన జనాలు
ఈ సమావేశంలో అయినా డీఏ, పీఆర్సీ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, సమాన పనికి సమాన వేతనం, తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. సాయంత్రం 4.30 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ జులై నాటికి ప్రస్తుత పీఆర్సీ గడువు పూర్తి కానుంది. గతంలో డీఏ, ఇతర పెండింగ్ బకాయిల విడుదలకు టైంబాండ్ పెట్టింది.