జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు దమ్ముంటే అతని గుర్తు ఎదో ప్రజలకు చెప్పమనండి అంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. పవన్ కళ్యాణ్ చుట్టూ ఉండే వారందరూ క్రిమినల్సే అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలో ఉపాధ్యాయ సంఘాల నేతలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో సమావేశం కొనసాగింది. ఈ మీటింగ్ లో ఉపాధ్యాయుల బదిలీలు, రేపటి జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే బదిలీలు చేపట్టామని తెలిపారు.
బాపట్ల జిల్లా అద్దంకి సిఐ రోశయ్యకు సంబంధించిన రాసలీల ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనతో మాట్లాడకుండా ఫోన్‌ను బ్లాక్ చేస్తే మామూలుగా ఉండదంటూ ఓ మహిళను సీఐ బెదిరిస్తున్న ఆడియో టేపు ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫార్ డ్యాం, గైడ్ బండ్ తదితర పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు విసిరారు. కాశీ యాత్ర లాగా వారాహి యాత్ర అంటే ఏం అర్థం అవుతుంది? అంటూ ఎద్దేవా చేశారు.
ఇటీవల విశాఖలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అమిత్ షా చెప్పేంత వరకు జీవీఎల్ కు తెలియదా అంటూ మండిపడ్డారు. విశాఖలో భూదందా నిజంగా జరిగితే ఎందుకు అడగలేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.