ప్రజల ఆరోగ్యం కోసం ఏపీ సర్కారు పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. సోమవారం 146 కొత్త అంబులెన్స్‌లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు.
జయవాడ దుర్గగుడి పాలకమండలి ఇవాళ సమావేశమైంది. అందులో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. దేవస్ధానంలో NMR లుగా పదుల సంవత్సరాలుగా కొనసాగుతున్న వారిని పర్మినెంట్ చేయాలని నిర్ణయించామన్నారు. మొత్తం 50 మంది NMR లు దుర్గ గుడిలో పని చేస్తున్నారని.. 50 శాశ్వత ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చైర్మన్ పేర్కొన్నారు.
కృష్ణానదీ తీరంలో నాగ ప్రతిమలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉండవల్లి సమీపంలో కృష్ణానది కరకట్ట దిగువన నాగ ప్రతిమలు పదుల సంఖ్యలో కనబడుతున్నాయి. సీతానగరం ప్రకాశం బ్యారేజీ ఎగువభాగాన రాతితో చేసిన నాగదేవత విగ్రహాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలీదుగానీ భారీగా వెలుగు చూశాయి.
NTV కథనాన్ని చూసిన ఎయిర్ ఇండియా అధికారులు వెంటనే స్పందించి మొదట విడతగా 80 మందికి మధ్యాహ్నం 01:30 గంటలకి స్పెషల్ విమానంలో పోర్టు బ్లైర్ కి తరలించారు. మిగతావారిని నెక్స్ట్ ఫ్లైట్ లో పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రజా సమస్యలు పూర్తిగా పరిష్కరించేందుకే జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించినట్లు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. అయితే, సీఎం జగన్ ను తలుచుకుంటేనే కొంతమందికి బిపి వస్తుంది అని ఆయన అన్నారు. బీపీ అంటే బాబు.. పవన్ అని ఆయన తెలిపారు.