East Godavari Road Accident: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
7 Family Members Died In East Godavari Road Accident: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ఆగి ఉన్న లారీని, అతివేగంగా వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మొత్తం 8 మంది కారులో ప్రయాణిస్తుండగా.. ఆరుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ఇద్దరిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించే క్రమంలో.. మరొకరు మృతి చెందారు. మరో వ్యక్తి ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగానే ఉందని సమాచారం. హైదరాబాద్‌లో ఓ వివాహానికి హాజరై, తిరిగి రాజమండ్రి నివాసానికి చేరుకుంటున్న నేపథ్యంలో.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు, 8 నెలల చిన్నారి ఉన్నారు.
Apsara Case: ఏంటి ఈ ట్విస్ట్.. అప్సరలకు ఇంతకు ముందే పెళ్లయిందా..!
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
ఈ ప్రమాదంలో చనిపోయిన వారు.. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వలిచేరుకి చెందిన వారిగా గుర్తించారు. ప్రస్తుతం వీళ్లు రాజమండ్రిలో ప్రకాష్ నగర్‌లో వద్ద నివాసం ఉంటున్నారు. మిద్దె సత్తిబాబు కారుని డ్రైవ్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అతని పక్కనే మిద్దె తేజ, శ్రావణి, అరుణలు కూర్చున్నారని.. చిన్నారితో పాటు మరో ఇద్దరి పేర్లు తెలియాల్సి ఉంది. హైదరాబాద్‌లో ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఆ కుటుంబం, అక్కడ ఎంతో సంతోషంగా గడిపింది. తమ గమ్యానికి మరో 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న తరుణంలో.. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని కబలించింది. సంఘటన స్థలాన్ని కొవ్వూరు డిఎస్పీ వర్మ పరిశీలించారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణం అతివేగమా? లేక నిద్రమత్తులో జరిగిందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?