ఏపీలోని రైతులకు జగన్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా పథకం నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేయనున్నారు. అన్నదాతలకు తొలి విడత పెట్టుబడి సాయం అందించనుంది. అలాగే ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రధాని అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు.
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ అధికారి రామ్ను సైబరాబాద్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తక్కువ ధరకు ఉద్యోగాలు, కార్లు ఇప్పిస్తానని నిందితులు పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సెటిల్మెంట్ల కోసం హైదరాబాద్లో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి రామ్ కార్యాలయం తెరిచాడు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సన్నాహక సమావేశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. ఈ నెల 27న ఢిల్లీలో నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రూరల్ పరిధిలోని గాంధీనగర్లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ ఆయన నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.