CM Jagan Comments After Meeting With AP Employees Leaders: మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ పలు ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన వారితో పలు విషయాలపై చర్చలు జరిపారు. ఉద్యోగుల విషయంలో తాము పడుతున్న తపనను వారికి వివరించారు. అటు.. ఉద్యోగ సంఘాల నేతలు సైతం ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో తీసుకున్న జీపీఎస్, కేటినెట్ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా.. జీపీఎస్ అమలు నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.
Raviteja remuneration: హిట్లతో పనేంటి.. ‘తగ్గేదే’ లేదంటూ మళ్లీ పెంచేసిన రవితేజ!
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే డెలివరీ మెకానిజం బాగుంటుందని, తద్వారా ప్రజలూ సంతోషంగా ఉంటారని అన్నారు. ఉద్యోగుల్ని సంతోషంగా ఉంచడానికి.. ప్రతీ కార్యక్రమం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాజకీయ కారణాలతో ఎవరైనా ఏదైనా చెప్తే.. ఆ వ్యక్తుల్ని నమ్మొద్దని, వారి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేయకుండా.. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం చూపించాలని ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగులకూ, రాష్ట్ర ప్రభుత్వానికీ మంచి జరగాలని ఆలోచన చేశామన్నారు.
Earthquake In Jammu: జమ్మూకశ్మీర్‌లో భూకంపం.. ఉత్తర భారతదేశం అంతటా ప్రకంపనలు! భయాందోళనలో ప్రజలు
జీపీఎస్ కోసం రెండు సంవత్సరాలు కసరత్తు చేశామని, ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణలోకి తీసుకుని డీఆర్‌లు జీపీఎస్‌లో ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. జీపీఎస్ అన్నది దేశానికే రోల్ మోడల్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రిటైరైన ఉద్యోగుల జీవన ప్రమాణాలను కాపాడినట్టు అవుతుందని చెప్పారు. ఇదే సమయంలో.. ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ నిర్ణయాలన్నీ 60 రోజుల్లోగా అమల్లోకి రావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, డైలీ వేజెస్ కేటగిరీ ఉద్యోగులను కూడా ఆప్కాస్ పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు చెప్పారు.