Minister Amarnath: ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మంత్రి అమర్‌నాథ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే ప్రతీ రూపాయికి లెక్క ఉందన్నారు. తాము ప్రజలకు జవాబుదారీగా ఉన్నామన్నారు. అప్పులు చేసినా అభివృద్ధి, సంక్షేమం కోసమే ఖర్చు పెడుతున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో మాదిరి లెక్కా డొక్కా చూపించలేని పరిస్థితి ఎక్కడా లేదన్నారు. నాలుగేళ్లు టీడీపీతో కలిసి ఉన్నప్పుడు ఈ మాటలు బీజేపీ నాయకత్వం మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. ఇటీవల అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న చిన్నమ్మ ఇప్పుడు కొత్త ప్రశ్నలు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. మాకంటే ఆమె మరిది చంద్రబాబును అడిగి ఉంటే ఈ రాష్ట్రానికి ఎందుకు అప్పులు పెరిగాయో అర్ధం అవుతుందన్నారు.
Also Read: Minister Roja: సినిమాలో హీరో పాలిటిక్స్‌లో జీరో.. పవన్‌పై రోజా కీలక వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై పురంధేశ్వరికి అవగాహన లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు ఎంత అవసరమో అంతే నిధులు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే ప్రతి రూపాయికీ లెక్క ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వ అప్పులపై బీజేపీ ఇలాగే మాట్లాడితే బాగుంటుందన్నారు. టీడీపీ హయాంలో నిధుల దుర్వినియోగంపై పురంధేశ్వరికి తెలియదా?. దీనిపై ఆమె మాట్లాడరా? మంత్రి అమర్‌నాథ్ నిలదీశారు.