Doctor Wife Radha Killed By Unknow People In Her House In Krishna District: కృష్ణా జిల్లాలోని బందరులో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ భార్యను గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. హతురాలు పిల్లల డాక్టర్ మహేశ్వరరావు భార్య ముచ్చర్ల రాధగా గుర్తించారు. జవార్‌పేట సెంటర్‌లో పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న వెంకటేశ్వర పిల్లల వైద్యశాలలో ఈ ఘటన వెలుగు చూసింది. తొలుత దుండగులు రాధ కళ్లల్లో కారం చల్లి, తలపై బలమైన ఆయుధంతో దాడి చేశారు. ఆపై ఆమె గొంతు కోశారు. రాధ చనిపోయిన అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకొని, దుండగులు పారిపోయారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, విచారణ చేపట్టారు.
Bull Viral Video: వర్షాలకు తట్టుకోలేక.. బిల్డింగ్‌పైకి ఎక్కిన ఆంబోతు! వైరల్ వీడియో
అయితే.. పోలీసుల విచారణలో కొన్ని ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిగువన డాక్టర్ మహేశ్వరరావు ఓపీ నిర్వహిస్తుండగా.. ఇంటిపైనే ఫ్యామిలీ నివసిస్తున్నట్టు పోలీసులు తేల్చారు. రాధ హత్య జరిగిన సమయంలో.. ఆమె భర్త ఓపీలో ఉన్నట్టు తెలిసింది. హంతకుడు ఇంట్లోకి వెళ్ళటానికి ఐదు మార్గాల్లో అవకాశాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 6 నెలల క్రితం.. ఆసుపత్రిలో డబ్బు గల్లంతైన ఘటన జరిగినట్టు విచారణలో వెల్లడైంది. ఆ సమయంలో ఇద్దరు సిబ్బందిని ఉద్యోగాల నుంచి డాక్టర్ తొలగించారు. బహుశా ప్రతీకారంలో భాగంగా.. వాళ్లే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకుల కోసం 3 బృందాలు ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.
Lockdown Love Story: విషాదాంతంగా ముగిసిన లాక్‌డౌన్ లవ్‌స్టోరీ.. ముగ్గురు బలి
మరో ట్విస్ట్ ఏమిటంటే.. ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలు పని చేయలేదు. దీంతో.. పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్పాట్‌లో హంతకుడు దాదాపు గంటసేపు ఉన్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్యకు గురైన రాధ, ఆమె భర్త మహేశ్వర రావు సెల్‌ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. మొబైల్స్ ద్వారా సాక్ష్యాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు, తమకు ఎవరిపై కూడా అనుమానాలు లేవని రాధ భర్త మహేశ్వరరావు చెప్తున్నారు.