AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కుంభకోణం కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డితోపాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా రాజ్ కేసిరెడ్డి పీఏ పైలా దిలీప్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం ఆయన దగ్గర ఉందని భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా దిలీప్ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతడు దుబాయ్‌కి పారిపోయేందుకు చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. పక్కా సమాచారంతో దిలీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ లొకేషన్ ద్వారా అతడి కదలికలపై నిఘా పెట్టిన సిట్ బృందం.. చెన్నై ఎయిర్‌పోర్టులో ఉన్నట్లు గుర్తించి అక్కడ అదుపులోకి తీసుకుంది.
Read Also: Dil Raju : ‘హిట్ 3’ దయ వల్ల తెలుగు ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది..
మరోవైపు మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డిని సీఐడీ కస్టడీకి అప్పగించేందుకు విజయవాడ కోర్టు అనుమతిచ్చింది. వారం రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అతడిని విచారించేందుకు అంగీకరించింది. ఈ కేసులో కీలకంగా ఉన్న అతడిని విచారించేందుకు 10 రోజుల కస్టడీకి అప్పగించాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేయగా.. వారం రోజులకు న్యాయస్థానం అనుమతిచ్చింది. కేసులో నిందితులుగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య ఆస్తుల వివరాలు సేకరిస్తోంది సిట్. స్కామ్ జరిగిన సమయంలో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఇవ్వాలని రిజిస్ట్రార్ శాఖ ఐజీకి లేఖలు ఇచ్చింది సిట్. ఏపీతో పాటు తెలంగాణ ఐజీ రిజిస్ట్రార్‌కు కూడా లేఖ రాసింది. కేసిరెడ్డి భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు సిట్ అధికారులు. ఈ క్రమంలో దిలీప్‌కు కూడా నోటీసులు ఇస్తారని తెలుస్తోంది.
Read Also: Eknath Shinde: ‘‘ప్రధాని మోడీ పాకిస్తాన్‌ని తుడిచిపెడతారు’’.. డిప్యూటీ సీఎం కామెంట్స్..
మొత్తం లిక్కర్ స్కాం పై సిట్ విచారణలో జోరు పెంచింది. 3200 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్టుగా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో వ్యక్తులతో పాటు సంస్థల పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించి మొత్తం 29 మంది మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. కేసుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి లను కూడా సిట్ విచారించింది మొత్తం ఈ కేసులో కీలక పాత్రధారిగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని గుర్తించి కేసులో ఏవన్ గా చేర్చింది సిట్. కేసు నమోదు చేసిన తర్వాత అరెస్టులపై కూడా సిట్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు ముగ్గురిని సిట్ అరెస్టు చేసింది. ఏ1 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ 6 సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ8 చాణక్యలను ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసింది.
Read Also: Jagtial: అడవిలో ఒంటరిగా వృద్ధురాలు.. విషాద కథలో బిగ్ ట్విస్ట్!
గురువారం కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పీఏ పైలా దిలీప్ ను చెన్నై ఎయిర్ పోర్ట్ లో సిట్ అదుపులోకి తీసుకుంది. కేసిరెడ్డి ఆర్థిక వ్యవహారాలన్నీ దిలీప్ చూశాడని సీట్ గుర్తించింది ఈ పరిస్థితుల్లో దిలీప్ కు నోటీసులు ఇద్దామని గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న సిట్.. అతను పరారీలో ఉండటంతో సెల్ఫోన్ పై టెక్నికల్ గా నిఘా పెట్టి చెన్నైలో దిలీప్ ని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసింది. దిలీప్ ని ఇవాళ కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించిన సిట్ దానికి సంబంధించిన అధికారిక వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో ఉన్న ఐజీ రిజిస్టార్లకు లేఖలు అందించింది. 2019 నుంచి 24 వరకు వైసిపి హయాంలో కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించే పనిలో సిట్ ఉంది..