MP Midhun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆరు రోజుల మధ్యంతర బెయిల్ గడువు పూర్తి కావడంతో సెంటర్ జైల్లో సరెండర్ అయ్యారు మిథున్ రెడ్డి.. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్లి సరెండర్ అయ్యారు..
Read Also: Realme P3 Lite 5G: మిలిటరీ గ్రేడ్ రెసిస్టెన్స్, 6000mAh బ్యాటరీ మొబైల్ కేవలం పదివేలకే అందుబాటులోకి?
కాగా, సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి.. ఇప్పటికే 47 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇక, ఏసీబీ ఇచ్చిన రిమాండ్ గడువు కూడా రేపటితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో రేపు విజయవాడలోని ఏసీబీ కోర్టులో మిథున్‌రెడ్డిని హాజరుపర్చనున్నారు పోలీసులు.. దీని కోసం రేపు ఉదయం ఏడు గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ఎంపీ మిధున్ రెడ్డిని పోలీస్ ఎస్కార్ట్ తో రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు తీసుకెళ్లనున్నారు పోలీసులు.. కాగా, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మద్దతు తెలిపింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అయితే సెప్టెంబర్ 9న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసుందుకు బెయిల్ ఇవ్వాలంటూ ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. ఏసీబీ కోర్టు ఐదు రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియడంతో ఈ రోజు సరెండర్ అయ్యారు మిథున్ రెడ్డి..