ఏపీ మద్యం ముడుపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు పంపింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టానికి (పీఎంఎల్‌ఏ) చట్టం కింద ఈడీ కేసు దర్యాప్తు చేస్తోంది. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని చంద్రారెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే సిట్ అధికారుల నుంచి పూర్తి సమాచారం సేకరించిన ఈడీ.. సిట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేయడంతో దర్యాప్తు…
రాజంపేట లోక్‌సభ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది.. ఏపీలో సంచలనంగా మారిన మద్యం స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి.. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. అయితే, మిథున్‌రెడ్డి పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకి నోటీసులు జారీ చేసింది సిట్.. గత ప్రభుత్వ హయంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన రజత్ భార్గవ.. కొద్ది నెలల క్రితం రిటైర్ అయ్యారు.. అయితే, ఆయనకు నోటీసులు జారీ చేసిన సిట్.. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది..
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది.. లిక్కర్ స్కాం కేసులో నిందితుల విదేశీ పర్యటనలపై సిట్ ఫోకస్ పెట్టింది. స్కాంలో ముడుపులకు సంబంధించి వసూలు చేసిన డబ్బును షెల్ కంపెనీల ద్వారా వేర్వేరు దేశాలు కూడా హవాలా మార్గంలో మళ్లించారని ఇప్పటికే అనుమానిస్తున్న నేపథ్యంలో నిందితుల విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలను సిట్ సేకరిస్తోంది..
సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతెత్తితే.. తప్పుడు కేసులు పెట్టి వేదిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ఏపీ లిక్కర్ కేసులో ఏడాదిగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరు లేదని, ఆయనను ఇరికించేందుకు సడెన్‌గా ఓ కానిస్టేబుల్‌తో తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నం చేశారన్నారు. తన పల్నాడు పర్యటన ముందు రోజు టాపిక్ చేయాలనే ఉద్దేశ్యంతో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. ఈ వయస్సులో రెడ్ బుక్ రాజ్యాంగం పాలన…
లిక్కర్ కేసులో నన్ను అరెస్టు చేయడానికి సిట్ అధికారులు ఎంతగానో తపన పడుతున్నారు... ఇలా పోలీసులు చేయడం చాలా బాధాకరం.. లిక్కర్ కేసులో సంబంధం లేని నన్ను ఇబ్బంది పెట్టాలని సంతోష పడాలని అనుకుంటున్నారని మండిపడ్డారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. గిరి, బాలాజీ సహా మరికొద్ది మందిని తీసుకెళ్లి నరకం చూపిస్తూన్నారట.. కాళ్లు, చేతులో కట్టేసి ఒక రహస్య ప్రదేశంలో పెట్టి వేధించి చెవిరెడ్డి పేరు చెప్పించాలని…
ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన రిటైర్డు ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు పేర్కొంది సిట్.. ఇద్దరు నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ పేర్కొన్న అంశాలు చర్చగా మారాయి.. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇతరులతో కలిసి లిక్కర్ సిండికేట్ గా ఏర్పడ్డారు.. ఈ సిండికేట్ లో ఉన్నతాధికారులు, పలువురు వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులు ఉన్నారు.. నిందితులు లిక్కర్ సిండికేట్ సభ్యుడు, ఈ కేసులో ఏ1గా…
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు విజయవాడలోని సిట్ విచారణ కార్యాలయం దగ్గరకు వచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్.. విజయసాయిరెడ్డి మా పార్టీ నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి.. ఆయన టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నాడు అని ఆరోపించారు..