AP Liquor Case: ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు..
- ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు..
- ఇద్దరు నిందితులు ఇతరులతో కలిసి లిక్కర్ సిండికేట్ గా ఏర్పడ్డారు..
- ఈ సిండికేట్ లో ఉన్నతాధికారులు, వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులు..
- రాజ్‌కేసిరెడ్డికి సన్నిహితులు.. ముడుపుల బదిలీల్లో కీలక పాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన రిటైర్డు ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు పేర్కొంది సిట్.. ఇద్దరు నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ పేర్కొన్న అంశాలు చర్చగా మారాయి.. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇతరులతో కలిసి లిక్కర్ సిండికేట్ గా ఏర్పడ్డారు.. ఈ సిండికేట్ లో ఉన్నతాధికారులు, పలువురు వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులు ఉన్నారు.. నిందితులు లిక్కర్ సిండికేట్ సభ్యుడు, ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్‌కేసిరెడ్డికి సన్నిహితులు.. స్కాంలో వచ్చిన ముడుపులు వేరే వారికి బదిలీల్లో కీలక పాత్ర పోషించారని సిట్ పేర్కొంది..
Read Also: Manchu Vishnu : ప్రభాస్ కు ఎప్పటికీ రుణపడి ఉంటా.. మంచు విష్ణు కామెంట్స్..
Also Read
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
ఇక, ఆర్థర్ ఆఫ్ సప్లై నిర్ణయాల్లో ఇతర నిందితులతో కలిసి ధనుంజయ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.. డిస్టలరీస్, మద్యం సరఫరాదారుల నుంచి ముడుపులు వసూలు చేసి ఇతర నిందితులతో పాటు అనేక మందికి బదిలీ చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది సిట్.. అయితే, లిక్కర్ స్కాంలో ఏ1, ఏ1 సన్నిహితుల నుంచి డబ్బులు వసూలు చేసి.. చివరికి ఎవరికి చేర్చారో గుర్తించాల్సి ఉందన్నారు. ఇక, సిండికేట్ సభ్యుల సమావేశాల్లో పాల్గొని ముడుపులు సకాలంలో అందేలా చూశారు.. కేసులో ఏ1 రాజ్‌కేసిరెడ్డి, ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ4 మిథున్ రెడ్డి, ఏ5 విజయ సాయిరెడ్డి, ఏ3 సత్య ప్రసాద్‌లతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నారు.. ఏ1 రాజ్ కేసిరెడ్డి కార్యాలయానికి పదే పదే వెళ్లి ముడుపుల వసూళ్లను పర్యవేక్షించారు.. ముడుపుల వసూలుకు వ్యవస్థ సృష్టించి దాన్ని నడిపించారు.. అంతేకాదు.. ఆ ముడుపులు ఎక్కడ..? ఎలా..? పెట్టుబడులు పెట్టారో పూర్తి సమాచారం ఇద్దరి దగ్గర ఉందని సిట్ పేర్కొంది.. ముడుపులు డబ్బుతో ఖరీదైన ఆస్తులు, కార్లు కొన్నారు.. ఆ వివరాలు వెలికి తీయాల్సి ఉందన్నారు.
Read Also: India-Pakistan: పాకిస్థాన్‌పై దౌత్య యుద్ధానికి భారత్ సిద్ధం.. ఏడు అఖిలపక్ష బృందాల ఏర్పాటు..
లిక్కర్ స్కాం కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని పేర్కొంది సిట్.. దీని కోసం ఇద్దరిని ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని కనీసం 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్ట్‌లో కోరింది సిట్.. కాగా, రిటైర్డు ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ వోఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు నిన్న సిట్ అధికారులు ప్రకటించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!