AP Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకి నోటీసులు జారీ చేసింది సిట్.. గత ప్రభుత్వ హయంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన రజత్ భార్గవ.. కొద్ది నెలల క్రితం రిటైర్ అయ్యారు.. అయితే, ఆయనకు నోటీసులు జారీ చేసిన సిట్.. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది..
Read Also: Betting Apps Case : రానా, విజయ్ దేవరకొండ సహా 29 మందిపై ఈడీ కేసు నమోదు..
కాగా, వైసీపీ పాలనలో జరిగిందని చెబుతున్న మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. ఇప్పటికే ఎంతో మందిని విచారించింది.. మరికొంతమందిని అరెస్ట్ చేసింది.. ఇప్పుడు.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రజత్ భార్గవకు నోటీసులు జారీ చేసి, శుక్రవారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం సేకరణ, పంపిణీ మరియు ధరల నిర్ణయాల్లో జరిగిన భారీ అక్రమాలపై జరుగుతున్న దర్యాప్తులో ఈ పరిణామం కీలక మలుపుగా చెబుతున్నారు.. సీనియర్ బ్యూరోక్రాట్ అయిన డాక్టర్ రజత్ భార్గవ.. తన పదవి కాలంలో..ఎక్సైజ్, పరిశ్రమలు మరియు ఆర్థిక శాఖల.. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సహా కీలక శాఖలను నిర్వహించారు. ప్రైవేట్ మద్యం సిండికేట్‌లతో కుట్ర జరిగిందని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో.. దానిపై సిట్ ఆయనను ప్రశ్నించనున్నట్టుగా తెలుస్తోంది..