రాహుల్ సభ్యత్వ రద్దుపై ఏపీ నుంచి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడక పోవటంతో ఆంధ్రుడిగా తాను సిగ్గుతో తల దించుకున్నానని తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఏపీలో వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్న పరిస్థితి ఎందుకు ప్రశ్నించలేదు అంటూ కేవీపీ నిలదీశారు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ పక్కనున్న ఏపీలో బీఆర్ఎస్ పాత్రపై రకరకాల ఉహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీలోని ప్రధాన పార్టీలకు చెందిన కొందరు నేతలు.. బీఆర్ఎస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏపీలోని ముగ్గురు కీలక నేతలు రేపు బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.
రాజ్యసభ ఆరేళ్ళ పదవీకాలం. రాజకీయనేతలకు అదో మంచి అవకాశం. అయితే ఈమధ్యకాలంలో రాజ్యసభ సీట్లు వ్యాపారవేత్తల్ని అందలం ఎక్కిస్తున్నాయి.రాజ్యసభకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెలుగు నేతలకు అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. కొన్ని చోట్ల ఏకగ్రీవాలు అవుతుంటే.. మరికొన్ని చోట్ల ఎన్నికల అనివార్యం అయ్యేలా వుంది. జూన్ 10 న ఓటింగ్ జరగనుంది. కొంతమంది నేతల్ని ఉత్తరాది నుంచి రాజ్యసభకు పంపాలని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఏపీ నుంచి పరిశీలనలో సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్,…