BJP: తొలి జాబితాలో లేని ఏపీ పేర్లు! కారణమిదేనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొత్తానికి ఈసారి ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. 195 మందితో కూడిన తొలి జాబితాను వెల్లడించింది. ప్రధాని మోడీతో పాటు 34 మంది కేంద్రమంత్రులు కూడా ఈ జాబితాలో కనిపించారు. అంతేకాకుండా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఈ ఫస్ట్‌లో ఉన్నారు.
తొలి జాబితాలో 16 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ జోలికి మాత్రం వెళ్లలేదు. తొలి జాబితాలో ఏపీ కూడా ఉంటుందని అనుకున్నారు. కానీ ఒక్కరు కూడా కనిపించలేదు. దీంతో ఏపీ నేతలకు నిరాశే ఎదురైంది.
Also Read
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు కుదిరింది. అలాగే బీజేపీతో కూడా పొత్తు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే ఏపీ జోలికి రాలేదని తెలుస్తోంది. మరోవైపు పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాలను అధిష్టానం సేకరిస్తోంది. పొత్తులపై క్లారిటీ వచ్చాకే ఏపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం విజయవాడ వేదికగా బీజేపీ నేతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పొత్తులు-ఒంటరిగా పోటీ చేసే అంశాలపై ఢిల్లీ నుంచి వచ్చిన శివప్రకాశ్ అభిప్రాయాలను సేకరిస్తు్న్నారు. శనివారం, ఆదివారం అభిప్రాయాలు సేకరించాక.. నివేదికను ఢిల్లీ బీజేపీ పెద్దలకు అందజేయనున్నారు.
ఇదిలా ఉంటే తొలి జాబితాలో 28 మంది మహిళలతో పాటు 50 ఏళ్ల లోపు 47 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓబీసీ వర్గానికి చెందిన 57 మందికి చోటు దక్కింది. మొత్తం 195 మందిలో 51 మంది ఉత్తర్ ప్రదేశ్ నుంచి, 20 మంది పశ్చిమ బెంగాల్ నుంచి, ఐదుగురు ఢిల్లీ నుంచి ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి 24 మంది, గుజరాత్ నుంచి 15 మంది, రాజస్థాన్ నుంచి 15 మంది, తెలంగాణ నుంచి 9 మంది, కేరళ నుంచి 12 మందిని ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించింది.
మోడీ మరోసారి వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు. అమిత్ షా గుజరాత్ గాంధీ నగర్ నుంచి , కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ గుజరాత్ పోర్‌బందర్ నుంచి పోటీలో ఉండనున్నారు. ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కేరళ తిరువనంతపురం నుంచి పోటీలో దిగనున్నారు. జ్యోతిరాదిత్య సింథియా మధ్యప్రదేశ్ గుణ నుంచి, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ నుంచి లోక్‌సభ బరిలో ఉన్నారు.
BJP releases first list of 195 candidates for Lok Sabha elections pic.twitter.com/ms1zTtzLfL
— ANI (@ANI) March 2, 2024
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?