కోనసీమ పెద్దలకు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. గత కొంతకాలంగా ఆయన మౌనంగా వున్నారు. తాజాగా ఆయన నోరువిప్పడం, బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. మీ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు చూసి బాధపడుతున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ ను యావత్తు ప్రపంచమే కొనియాడుతుంది.
అటువంటి మహా వ్యక్తి పేరు కోనసీమకు పెట్టినందుకు అలజడులు సృష్టించడంలో న్యాయం లేదు. అంబేద్కర్ పేరు మన ప్రాంతానికి పెట్టినందుకు గర్వంగా ఫీల్ అవ్వాలి. అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంబేద్కర్ పేరు పెట్టిన దానికి అభ్యంతరం పెట్టడం న్యాయమా? అని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.
నేనేమీ పెద్ద మేధావిని కాను, పెద్దగా చదువుకోలేదండి. కానీ ఈ మధ్య మీ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు స్నేహితులు, మీడియా ద్వారా తెలుసుకుని చాలా బాధపడుతున్నాను. మనమందరం సోదరభావంతో మెలగవలసిన సమయంలో కులాలు,మతాలు కుంపట్లలో మగ్గిపోతున్నామని ఈ లేఖ రాయాలనిపించి రాశాను.. మీ మనోభావాలకు ఇబ్బందిగా వుంటే పెద్ద మనసు పెట్టి క్షమించండి. గతంలో అయితే చాలా విషయాలలో పట్టింపులు, మూఢనమ్మకాలతో తగాదాలు పడేవారు. సమాజంలో అప్పటికీ ఇప్పటికే చాలా మార్పులు వచ్చాయి.
మరలా వెనుకటి రోజులకు వెళుతున్నామో అన్నది ఆలోచించండి. మహావ్యక్తి పేరును కోనసీమకు పెడితే అలజడులు తేవడం న్యాయంగా లేదండి, వీరు పేరు రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా ఎవరూ కాదనలేని పరిస్థితి అని నాభావన. న్యాయతా అయితే జీఎంసీ బాలయోగి గారి పేరు పెట్టాలి. లోక్ సభ స్పీకర్ అయిన తరువాతనే మీ ప్రాంతం అభివృద్ధి చెందింది.ఏదో ఒక కారణంతో బాలయోగి గారిపేరును పరిగణనలోనికి తీసుకోలేదు. దయచేసి గౌరవ పెద్దలకు చేతులెత్తి నమస్కరిస్తూ మరొక సారి కోరతా వున్నాను. గౌరవమంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, కుడుపూడి సూర్యనారాయణరావు, కల్వకొలను తాతాజీ ఈ సమస్యకు ముగింపు పలకడానికి ఆలోచన చేయమని కోరుతున్నానండి. నేను ఏ స్వార్థంతోను ఈ లేఖ మీకు రాయలేదండి. మీరందరూ సంతోషంగా వుండాలని నా కోరికండి.. అంటూ లేఖ రాశారు ముద్రగడ.
Stampede at Khatu Shyam Temple: గుడిలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి