అమూల్ ఒప్పందం.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమూల్ ఒప్పందంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరపిన ఏపీ హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు.. గుజరాత్‌లోని అమూల్‌కి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అమూల్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై.. ఎలాంటి నిధులు ఖర్చు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఏపీడీడీఎఫ్ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ సీఎం జగన్ అధ్యక్షత కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో రఘురామ కృష్ణంరాజు సవాల్ చేశారు. ఈ నిర్ణయాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించి, రద్దు చేయాలని కోరారు.. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. మరోవైపు.. గోదావరి జిల్లాల్లో అమూల్ పాలసేకరణను ఈరోజే ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.. పాడి రైతులకు పెద్ద ఎత్తున లాభం ఇస్తారని.. అమూల్ పైసా కూడా లాభం తీసుకోకుండా.. రైతుల కోసం పని చేస్తుందని వెల్లడించారు. మరోవైపు.. ఏపీడెయిరీకి చెందిన వేల కోట్ల ఆస్తులను అప్పనంగా అమూల్‌కు అప్పగిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.
Also Read
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్‌కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
తాజావార్తలు
-
Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!
-
Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్‌కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
-
Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక అధికారాలు
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్‌పై వాంగ్‌చుక్ భార్య విమర్శలు..
-
Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!