ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు ఏపీ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తక్షణమే కరోనా బాదితులకు మందును పంపిణీ చేయాలని ఆదేశించింది. ఇక కంటి చుక్కల మందుపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 21 వ తేదీకి వాయిదా వేసింది హైకోర్ట్. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటికే ఆనందయ్య మందును ఈరోజు నుంచి పంపిణీ చేస్తున్నారు. మొదటగా సర్వేపల్లి నియోజక వర్గంలోని ప్రజలకు అందించబోతున్నారు. ఆ తరువాత మిగతా జిల్లాల్లోని వారికి మందును అందిస్తామని ఇప్పటికే ఆనందయ్య తెలిపారు. హైకోర్ట్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆనందయ్య మందు పంపిణీకి లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు.