దుండగులు కిరాతకానికి పాల్పడ్డారు. కర్నూలు జిల్లాలో ఏపీ హైకోర్టు న్యాయవాది వి.వెంకటేశ్వర్లును దారుణంగా హతమార్చారు. కర్నూలు నగర శివారులోని సఫా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వెంకటేశ్వర్లు మృత దేహాన్ని గుర్తించారు పోలీసులు. హత్య చేసి రోడ్డు పక్కన పారేసి ఉంటారని భావిస్తున్నారు పోలీసులు. ఆవుల వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఈ నెల 7 వ తేదీనుంచి ఆయన కనిపించడం లేదు. ఆయన అదృశ్యంపై కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. చింతకుంటలో తమ్ముని వద్దకు వెళ్లి తిరిగివస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై సీఎస్ సమీర్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్లో కీలక అంశాలు ప్రస్తావించారు.. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు 6 నెలలు కాదు.. 60 నెలలు కావాలని పేర్కొన్నారు.. రాజధాని ప్రాంతం నుంచి వెళ్లిపోయిన వర్కర్లు, యంత్రాలను రప్పించేందుకే రెండు నెలల సమయం అవసరమన్న ఆయన.. అమరావతిలో పనులు మొదలు పెట్టేందుకే 8 నెలల సమయం పడుతుందన్నారు.. రోడ్ల నిర్మాణం కోసం 16 నెలలు అవసరం అవుతుందని.. రోడ్ల పనులు పూర్తి చేశాక, డ్రైనేజి,…
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని గత నెల 3వ తేదీన హైకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుకు సంబంధించి తాజాగా ఏపీ ప్రభుత్వం తాజాగా హైకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. 190 పేజీలతో కూడిన ఈ అఫిడవిట్లో ప్రభుత్వం పలు అంశాలను ప్రస్తావించింది. ఈనెల 3లోగా సీఆర్డీఏ రైతులకు ఇచ్చిన ప్లాట్లలో పనులు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు…
తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలిలో నేర చరితుల్ని సభ్యులుగా చేర్చడంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘోరమైన నేరాలకు పాల్పడిన కొందరు వ్యక్తులు ఇటీవల టీటీడీ పాలకమండలిలో సభ్యులుగా చేరారని అటువంటి వారిని వెంటనే తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. నేరచరిత ఉన్నవారిని ఆలయ పాలకమండలిలో సభ్యులుగా ఎలా నియమిస్తారని.. భగవంతుని సేవలో నేరచరితులు ఉండటాన్ని ఉపేక్షించేది లేదంటూ ప్రభుత్వంపై, టీటీడీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.…
కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్లకు జైలు శిక్ష బదులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఐఏఎస్ అధికారులు ఏయే జిల్లాలలోని హాస్టళ్లలో సంక్షేమ కార్యక్రమాలు చేయాలో హైకోర్టు తీర్పు కాపీలో స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయా జిల్లాల్లోని హాస్టళ్లల్లో ప్రతి నెలలో ఓ రోజు ఏడాది పాటు సేవలందించి భోజన ఖర్చులు భరించాలని ఆదేశించింది. ఈ ప్రకారం 8 మంది ఐఏఎస్లకు 8 జిల్లాల కేటాయింపు…
కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారులు క్షమాపణలు కోరడంతో జైలుశిక్షను తప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఏడాది పాటు సంక్షేమ హాస్టళ్లల్లో ప్రతి నెలలో ఒకరోజు సేవ చేయాలని తీర్పు ఇచ్చింది. ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్లను ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాల ఏర్పాటు చేయవద్దన్న…
ఆ మధ్య ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలతో కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయింది.. దీంతో ప్రాజెక్టు సమీపంలోని కాలనీలోకి భారీగా నీరు చేరింది.. వరద ఉదృతి కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.. భారీ వర్షాలు, వరదలతో ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో రాత్రికి రాత్రే ప్రాణాలరచేత బట్టుకోని బయటపడ్డారు పలు ప్రాంతవాసులు. కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. పెద్ద ఎత్తున ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది. అయితే, వరదలకు…
ఏపీ రాజధాని అమరావతిపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్కు లేఖ రాశారు. రాజధానిపై శాసన అధికారం తీసుకోవడానికి ప్రభుత్వానికి హక్కు లేదు అంటూ హైకోర్టు వ్యాఖ్యానించడం తనను బాధించిందని లేఖలో ధర్మాన తెలిపారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిపాలనకు సంబంధించి శాసన నిర్మాణం, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల పరిధులను స్పష్టంగా నిర్ణయించడం జరిగిందని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య…
అమరావతిలోనే రాజధాని నిర్మాణాలు చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా పార్లమెంట్ సభను శుక్రవారం నాడు హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడు రాజధానుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వం విధానమని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి…
ఏపీలో 3 రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రకటించడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పునిచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని తన తీర్పులో స్పష్టం చేసింది. అంతేకాకుండా రాజధాని అంశంలో చట్టాలు చేసే హక్కు అసెంబ్లీకి లేదని వెల్లడించింది. దీంతో హైకోర్టు తీర్పుపై వైసీపీ మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. అయితే మరోవైపు హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ సమీక్ష…