ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేవలం ఆరు న్యాయమూర్తుల ఖాళీలు మాత్రమే భర్తీ చేయాల్సి ఉందని న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆమోదించిన శాశ్వత, అదనపు న్యాయమూర్తుల సంఖ్య 37 మాత్రమే అని చెప్పారు. అందులో ఆగస్టు 1 నాటికి 24 మంది న్యాయమూర్తులు ఉన్నారు. సుప్రీంకోర్టు కొలిజీయం జూలై 20న ఏడు మంది న్యాయాధికారులకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ సిఫార్సు చేసింది.
Liger: తల్లి కొడుకుల మధ్యలో డ్రామా క్వీన్.. పూరి మార్క్ రొమాన్స్
దీంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరిందని మంత్రి చెప్పారు. మిగిలిన ఆరు జడ్జిల ఖాళీలకు సంబంధించి హైకోర్టు కొలీజియం నుంచి ఎలాంటి సిఫార్సులు ప్రభుత్వానికి అందలేదని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల ఖాళీల భర్తీ న్యాయవ్యవస్థ, పాలనావ్యవస్థ మధ్య సమన్వయంతో నిరంతరం కొనసాగే ప్రక్రియ. దీనికి రాష్ట్ర, కేంద్ర స్థాయిలో వివిధ రాజ్యాంగ సంస్థల మధ్య సంప్రదింపులు, ఆమోదం అవసరం ఉంటుందని మంత్రి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల భర్తీని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కిరణ్ రిజిజు తెలిపారు. ఇదిలా వుంటే ఏపీ హైకోర్టుకు నూతనంగా ఏడుగురు జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కొత్త జడ్జీలతో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్. ఏడుగురు జడ్జీల్లో నలుగురు న్యాయమూర్తులుగా, ముగ్గురు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు.