కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు జైలుశిక్ష విధించింది. ఈ కేసులో ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, వీరపాండ్యన్, అరుణ్ కుమార్‌లకు నెలరోజుల పాటు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కర్నూలు జిల్లాలో వీఏవో నియామకం విషయంలో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.
ఈ కేసులో ధర్మాసనం తీర్పు అమల్లో ఐఏఎస్ అధికారులు నిర్లక్ష్యం వహించినందుకు హైకోర్టు జైలుశిక్ష విధించింది. అయితే ఐఏఎస్ అధికారులు వీరపాండ్యన్, అరుణ్ కుమార్ విజ్ఞప్తితో జైలుశిక్ష అమలును ఆరు వారాల పాటు నిలుపుదల చేసింది. కోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌లో పూనం మాలకొండయ్య అప్పీల్ చేశారు. దీంతో పూనం మాలకొండయ్య జైలు శిక్షను హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.
Andhra Pradesh: కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు శుభవార్త