ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆరుగురు ఐఏఎస్‌లకు ఊరట లభించింది… ఐఏఎస్ అధికారులకు ఈమధ్యే విధించిన సేవా శిక్షను ఎనిమిది వారాల పాటు సస్పెండ్ చేసింది హైకోర్టు… కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకుగాను కోర్టు ధిక్కరణ కేసులో ఎనిమిది మంది ఐఏఎస్‌లకు సేవా శిక్షను హైకోర్టు సింగిల్ జడ్జి విధించిన విషయం విదితమే కాగా.. ఈ శిక్షను డివిజనల్ బెంచ్‌లో గత వారం సవాల్ చేశారు.. అందులోని ఇద్దరు ఐఏఎస్ అధికారులు… దీంతో, సేవాశిక్షను ఎనిమిది వారాల పాటు సస్పెండ్ చేసింది ఛీప్ జస్టిస్ ధర్మాసనం. ఇక, గురువారం సేవాశిక్షను ధర్మాసనంలో సవాల్ చేశారు మరో ఆరుగురు ఐఏఎస్ అధికారులు. జస్టిస్ అసదుద్దిన్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ సాగింది.. దీంతో, ఆరుగురు ఐఏఎస్ అధికారుల సేవాశిక్షను ఎనిమిది వారాలు సస్పెండ్ చేసింది హైకోర్టు ధర్మాసనం… ఇక, ఈ కేసులో తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.
Read Also: Shigella: కేరళలో వెలుగుచూసిన షిగెల్లా కేసు.. లక్షణాలు ఇవే..!