టీటీడీ బోర్డు మెంబర్లలో క్రిమినల్ కేసులు ఉన్నవారు, ప్రత్యేక ఆహ్వానితులు ఎక్కువ మంది ఉన్నారని వేసిన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే టీటీడీ బోర్డు మెంబర్లు 18 మందిలో ఇద్దరు మాత్రమే కౌంటర్ దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా దాఖలు చేయని వారిని కూడా కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయకుంటే విచారణ కొనసాగిస్తామని హై కోర్టు స్పష్టం చేసింది. ఆర్డినెన్స్ తెచ్చిన తరువాత…
సోషల్ మీడియాలో జడ్జీలను దూషించిన కేసులో యుట్యూబ్ పై సీరియస్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కొత్త టెక్నిక్‌తో పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాది అశ్వని కుమార్… అమెరికాలో ఉన్న పంచ్ ప్రభాకర్ ప్రైవేటు యూజర్ ఐడీ పెట్టుకొని.. అడిగిన వారికి వ్యూస్ ఇస్తున్నారని కోర్టుకు వివరించారు.. ప్రైవేట్ వ్యూస్‌ని ఇస్తూ కోర్టులను ఇంకా అగౌరవపరుస్తున్నారంటూ తన అఫడవిట్లో పేర్కొన్నారు.. Read Also: Goutham Reddy passes…
జడ్జీల కొరతతో ఇబ్బంది పడుతున్న ఏపీ హైకోర్టుకు ఇప్పుడు కేంద్రం మరో ఏడుగురు న్యాయమూర్తులను నియమిస్తున్నట్లు ఉత్వర్వులు జారీ చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో నేడు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు ఈ రోజు ఉదయం 10.30 గంటలకు అమరావతిలోని మొదటి కోర్టు హాల్లో ప్రమాణం స్వీకారం చేయనున్నారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వీరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇటీవల…
చింతామణి నాటకం నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సీజే ధర్మాసనం ముందుకు పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ పై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. నిషేధాన్ని సమర్థిస్తూ ఆర్యవైశ్య సంఘాల తరఫున 3 ఇంప్లీడ్ పిటిషన్లను హైకోర్టు విచారించింది. అయితే ఇంప్లీడ్ పిటిషన్లపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 200 ఇంప్లీడ్ పిటిషన్లు వేస్తారా, విచారణను సాగదీసేందుకే…
ఏపీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందన్న కారణంతో ఓ సినిమా థియేటర్‌ను తహసీల్దార్ సీజ్ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సినిమా థియేటర్‌ను సీజ్ చేసే అధికారం తహసీల్దార్‌కు లేదని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని కారణంగా శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని శ్రీనివాసమహల్ థియేటర్‌ను సీజ్ చేస్తున్నట్లు గతంలో తహసీల్దార్ ప్రకటించారు. అయితే తహసీల్దార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ థియేటర్ యజమాని శంకర్రావు హైకోర్టును ఆశ్రయించాడు. Read Also: ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.26వేల కోట్లతో…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చింతామణి నాటాకాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై భిన్నవాధనలు వినిపిస్తున్నాయి.. ఈ వ్యవహారం కోర్టు మెట్లుఎక్కిన విషజ్ఞం తెలిసిందే కాగా.. చింతామణి నాటకం నిషేధంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఒక పాత్ర బాగోకపోతే మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ స్పందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.. నాటకంలో ఒక పాత్ర బాగోకపోతే…
ఏపీలో పీఆర్సీ రగడ మాములుగా జరగడం లేదు. ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు అన్నట్టు తయారైంది పరిస్థితి. ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తామని చెబుతున్నా ఉద్యోగులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. డిమాండ్లు సాధించుకునేందుకు ఎంతవరకైనా వెళ్తాం అని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. తాజాగా ఏపీ ఉద్యోగుల ఛలో విజయవాడకు అనుమతి ఇవ్వొద్దని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. Read Also: ఉద్యోగుల ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కొత్త జిల్లాల ప్రతిపాదన:…
న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల కేసు విచారణ సందర్భంగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. భారతదేశంలోని చట్టాలు న్యాయస్థానాలను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.. ట్విట్టర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని అభిప్రాయపడింది ఏపీ హైకోర్టు. ట్విట్టర్లో పోస్టులు డిలీట్ చేసినా.. విపిన్ అని టైప్ చేస్తే వెంటనే ఆ పోస్టులు వస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు హైకోర్టు న్యాయవాది అశ్వినీ కుమార్.. దీనిపై సీరియస్ అయిన హైకోర్టు..…
ప్రభుత్వం అందించే వివిధ రకాల ప్రయోజనాలు పొందేందుకు అర్హతలుండాలి. అన్ని అర్హతలుండి కూడా ఠంచనుగా వస్తున్న పింఛన్ ఆగిపోతే వారి పరిస్థితి ఎలా వుంటుంది? కోర్టుల ద్వారా న్యాయం జరిగితే ఆ ఆనందానికి అవధులే వుండవు. తన పింఛను కోసం కోర్టుకెక్కిన ఓ వృద్ధురాలు విజయం సాధించింది. పింఛన్ వెంటనే పునరుద్ధరించడంతోపాటు ఎప్పటి నుంచి పింఛను ఆపేశారో ఆ మొత్తం కూడా లెక్కకట్టి ఇవ్వాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరుపల్లికి…