మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ హైకోర్టులో కీలక పరిణామాలు జరిగాయి.. వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో నిందితులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది హైకోర్టు.. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నా దేవిరెడ్డి శివశంకర రెడ్డి, గజ్జల ఉమా మహేశ్వరరెడ్డి, సునీల్ యాదవ్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. అయితే, ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. అనంతరం బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.. కాగా, ఈ కేసులో గతంలోనే కడప కోర్టు నిందితులకు బెయిల్‌ను తిరస్కరించింది.. దీంతో, హైకోర్టును ఆశ్రయించారు నిందితులు..
Read Also: Adilabad KGBV Food Poison: చికెన్ తో ఫుడ్ పాయిజన్.. 16 మంది విద్యార్థులకు అస్వస్థత
అయితే, ఈ సమయంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని హైకోర్టులో వాదనలు వినిపించారు సీబీఐ తరపు న్యాయవాది.. కానీ, ఇప్పటికే ఈ కేసులో ఛార్జీషీటు వేశారని, పూర్తి సమాచారం సేకరించిన తర్వాత కూడా జైలులో ఉంచడం ఎంతవరకు కరెక్ట్ అని నిందితుల తరఫు లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసులో చార్జ్ షీట్ వేశారని.. అయినప్పటికీ నిందితులకు బెయిల్ మంజూరు చేయకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమని పేర్కొన్నారు.. అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లను సీబీఐ తరఫున వాదనలు వినిపించిన లాయర్ చెన్నకేశవులు వ్యతిరేకించారు. నిందితులకు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని వాదించారు.. దీంతో, ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది ఏపీ హైకోర్టు.