తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డికి షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కోర్టు ఉత్తర్వులు అమలు చెయ్యలేదని టీటీడీ ఈవోకు శిక్ష విధించింది.. దాంతో పాటు రూ. 2 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా.. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఈ తీర్పు వెలువరిస్తున్నామని స్పష్టం చేసింది. కాగా గతంలో టీటీడీలో పని చేస్తున్న ముగ్గురు తాత్కాలిక సిబ్బంది క్రమబద్దీకరణ కోసం కోర్టును ఆశ్రయించగా, ముగ్గురిని క్రమబద్దీకరించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే,…
CPI Narayana: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగులో ఆరో సీజన్ ప్రసారమవుతోంది. ప్రముఖ హీరో నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి స్పందించారు. ఈ షో ఒక సాంఘీక దురాచారం వంటిదని విమర్శించారు. బిగ్ బాస్ షోను రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ షోను రద్దు చేయాలని తెలంగాణలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ…
High Court: ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో జగన్ ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అమరావతిలో ఇతరులకు స్థలాలు కేటాయించడంపై కొందరు రైతులు హైకోర్టులో మధ్యంతర దరఖాస్తులు దాఖలు చేశారు. విచారణ పూర్తయ్యే వరకూ భూములు వేరేవారికి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన రైతుల తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. కొత్తచట్టంపై రైతుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని…
High Court: భూకబ్జా కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. జలవనరుల శాఖకు చెందిన 0.16 సెంట్ల భూమిని కబ్జా చేశారంటూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేయగా.. తనపై నమోదైన భూ ఆక్రమణ కేసులు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అయ్యన్నపాత్రుడు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం నాడు హైకోర్టు విచారించింది. సీఐడీ విచారణ కొనసాగించుకోవచ్చు కానీ.. ఈ కేసు విషయంలో…
High Court: తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ షో మధ్యలోనే ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని, ఫ్యామిలీతో కలిసి ఈ షోను చూసే పరిస్థితి లేదని ఆరోపిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాగార్జునతో…