AP Three Capitals: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల వ్యవహారంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. మూడు రాజధానుల చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదన్న హైకోర్టు.. అమరావతి ప్రాంతంలో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు నిర్దిష్ట గడువు పెట్టింది.. ఆరు నెలలలోపు రాజధాని నిర్మాణం పూర్తి కావాలని పేర్కొంది.. అయితే, హైకోర్టు తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చాలెంజ్ చేసింది వైఎస్ జగన్ సర్కార్.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.. అయితే, గత నవంబర్లో…
High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి ఇద్దరు అధికారులకు శిక్ష విధించింది.. కోర్టు ధిక్కరణ కేసులో ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణ, ఐఏఎస్ అధికారి బూడితి రాజశేఖర్ కు నెల రోజుల పాటు జైలు శిక్షతో పాటు 2000 రూపాయల జరిమానా విధించింది హైకోర్టు.. అయితే, కోర్టుకు భేషరతుగా క్షమాపణలు చెప్పారు అధికారులు రామకృష్ణ, రాజశేఖర్.. ఇద్దరు అధికారులు కోర్టును క్షమాపణ కోరడంతో.. ఆ తర్వాత తీర్పును సవరించిన హైకోర్టు.. ఇవాళ సాయంత్రం వరకు కోర్టులోనే నిలబడాలని అధికారులకు…
Andhra Pradesh: ఏపీలో సలహాదారుల నియామకాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్లో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారా అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సలహాదారుల నియామకానికి అంతు ఎక్కడ ఉందని మండిపడింది. ముఖ్యమంత్రి, మంత్రులకు సలహాదారులను నియమిస్తే అర్ధం చేసుకోగలం కానీ.. ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించడం ఏంటని హైకోర్టు నిలదీసింది. సలహాదారుల నియామకం రాజ్యాంగ బద్దమో కాదో తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను…
Andhra Pradesh: దేశంలో అత్యధిక కోర్టు ధిక్కరణ కేసులు ఏపీ హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. స్వయంగా ఈ విషయాన్ని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో కలిపి 28,469 ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అయితే వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 11,348 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అంటే మొత్తం కేసుల్లో ఏపీలోనే 39.86 శాతం కేసులు పెండింగ్లో ఉన్నాయి. Read…
High Court: టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో టీటీడీ ఈవోకు నెల రోజుల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం స్టే విధించింది. తమను క్రమబద్ధీకరించేలా టీటీడీ ఈవోను ఆదేశించాలంటూ ముగ్గురు ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన సింగిల్ జడ్జి ధర్మాసనం ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు…
AP High Court: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఇప్పటం గ్రామస్తులకు ఏపీ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఇప్పటం గ్రామంలో ప్రభుత్వ కూల్చివేతలపై నోటీస్ ఇవ్వకుండా కూల్చారంటూ.. ఇప్పటం గ్రామస్తులు గతంలో హైకోర్టుకు వెళ్లారు. అయితే తాము నోటీసులు ఇచ్చే కూల్చివేతలు చేపట్టామని ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో.. ఈ కేసుకు సంబంధించి 14 మంది పిటిషనర్లకు రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ మేరకు సింగిల్ బెంచ్…
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరోసారి ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.. ఈ మధ్యే ఏపీలో పర్యటించిన ఆమెకు ఏపీ ప్రభుత్వం ఘనంగా పౌర సన్మానం చేసింది. పోరంకిలో గవర్నర్ బిష్వభూషన్ హరిచందన్.. సీఎం జగన్ ఆమెకు సన్మానం చేశారు. మూడు రోజుల పాటు జరిగిన పర్యటనలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.. అయితే, ఇప్పుడు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించనున్నారు రాష్ట్రపతి.. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన…