ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుపై హైకోర్టును ఆశ్రయించారు సూర్యనారాయణ. షోకాజ్ నోటీసు ఇవ్వవలసిన అవసరం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు సూర్యనారాయణ. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ ను ఆశ్రయించే హక్కు అందరికీ ఉంటుందని పేర్కొన్నారు సూర్యనారాయణ. షొకాజ్ నోటీసు సరికాదని ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆశ్రయించారు సూర్యనారాయణ.ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు అందేలా చట్టం చేయాలని కోరుతూ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవడంపై రచ్చ రేగుతోంది. ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతోందని సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు.
Read Also: Ys Jaganmohan Reddy: ఇవాళ, రేపు సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన
దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి.. ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో.. ఏడు రోజుల్లోగా తెలియచేయాలని జీఏడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయటం రోసా (Rosa Rules) కు విరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అయితే వాటిని వినియోగించకుండా గవర్నర్ ను ఎందుకు కలిశారని ఆ సంఘాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. 12వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడిందని ఉద్యోగుల జిపీఎఫ్ ఖాతా నుంచి ప్రభుత్వం 500 కోట్లు డ్రా చేసిందని.. గవర్నర్‌ను కలిసిన ఉద్యోగ సంఘం నేతలు ఆరోపించారు.
ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే. అదే ప్రభుత్వంపై గవర్నర్‌కు ఉద్యోగ సంఘాలు ఫిర్యాదు చేయటం అనూహ్య పరిణామంగా భావిస్తున్నారు. ఏ ఉద్యోగ సంఘం అయినా, ఉద్యోగులు అయినా తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఏదో ఒక రూపంలో నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుంది. అయితే అదే సమయంలో ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి, మంత్రులపై రాజకీయ నాయకుల్లా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే సూర్య నారాయణ గవర్నర్‌కు ఫిర్యాదు చేయటమే కాకుండా, అవసరమైతే ప్రభుత్వంపై క్రిమినల్ కేసు కూడా పెడతానని అనడాన్ని మిగిలిన ఉద్యోగ సంఘాలు తప్పుబడుతున్నాయి.ప్రభుత్వ పెద్దల దగ్గర తనకు ప్రాధాన్యత తగ్గటంతో, తాను కోరుకున్న పదవులు రాకపోవడంతో… పూర్తి స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక వైఖరి తీసుకోవాలనుకుంటున్నారని ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Read Also: Anupama Parameswaran: నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగిందే..