High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి ఇద్దరు అధికారులకు శిక్ష విధించింది.. కోర్టు ధిక్కరణ కేసులో ఐఆర్‌ఎస్ అధికారి రామకృష్ణ, ఐఏఎస్ అధికారి బూడితి రాజశేఖర్ కు నెల రోజుల పాటు జైలు శిక్షతో పాటు 2000 రూపాయల జరిమానా విధించింది హైకోర్టు.. అయితే, కోర్టుకు భేషరతుగా క్షమాపణలు చెప్పారు అధికారులు రామకృష్ణ, రాజశేఖర్.. ఇద్దరు అధికారులు కోర్టును క్షమాపణ కోరడంతో.. ఆ తర్వాత తీర్పును సవరించిన హైకోర్టు.. ఇవాళ సాయంత్రం వరకు కోర్టులోనే నిలబడాలని అధికారులకు ఆదేశించింది.. రాజశేఖర్ గతంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.. ఇక, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్‌గా ఉన్నారు రామకృష్ణ.. మొత్తంగా ఇద్దరు అధికారులకు ముందుగా నెలరోజుల జైలుశిక్ష, రెండువేలు జరిమానా విధించిన కోర్టు క్షమాపణలు చెప్పడంతో.. సాయంత్రం వరకు కోర్టు హాల్‌లోనే నిలబడాలన్న ఆదేశాలతో సరిపెట్టింది.
Read Also: Aadhar Update : ఏపీ వాసులకు అలర్ట్.. రేపటి నుంచి గ్రామ సచివాలయాల్లో ఆధార్ సేవలు