దేశంలోని 12 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలో పీఎం కిసాన్ 11వ విడత డబ్బులని విడుదల చేశారు. పీఎం కిసాన్ ద్వారా వచ్చే నిధులతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు భరోసా అందిస్తున్నారన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గ్రామంలోనే గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని నిరూపించారు. రైతులకు అవసరమయ్యే విధంగా అన్ని కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆఫ్రికా దేశాలకు మనలా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని…
ఒక్క ఘటనతో ఎన్నో సమస్యలు తెరమీదకు వచ్చాయి, కోనసీమ జిల్లా వాసులకు ఇంటర్నెట్ కష్టాలు తీరడం లేదు. నెట్ కోసం గోదారి గట్టు చేరుకుంటున్నారు జనం. అమలాపురంలో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అయింది. కోనసీమ జిల్లాలో ఇటీవల జరిగిన అల్లర్ల కారణంగా ఇంటర్నెట్ సేవలు బంద్ కావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ ఎక్కడ వస్తే అక్కడికి చేరుకుంటున్నారు జనం. గోదావరి గట్ల మీదకు వచ్చి నెట్ సిగ్నల్స్…
అవకాశం దొరికితే చాలు జనాన్ని అడ్డంగా ముంచేస్తున్నారు కేటుగాళ్ళు. విశాఖలో ఓ నకిలీ సివిల్ సప్లైస్ అధికారి గుట్టురట్టయింది. పౌర సరఫరాల అధికారిగా చెప్పుకుంటూ హాస్టళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకుల నుంచి డబ్బులు దండుకుంటున్న రాజమహేంద్రవరానికి చెందిన ఆడంకి చక్రవర్తిని విశాఖలోని ఎంవీపీ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. చక్రవర్తి తన స్నేహితుడు శ్రీనివాస్తో కలిసి శనివారం ఎంవీపీ కాలనీలోని గోదావరి టిఫిన్ సెంటర్కు వెళ్లి కమర్షియల్ సిలిండర్లకు బదులు డొమెస్టిక్ సిలిండర్లను ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించాడు.…
తెల్లబంగారం అని రైతులు ముద్దుగా పిలుచుకునే పత్తికి మహర్దశ పట్టింది. పత్తి ని తెల్ల బంగారం అన్నది మాటల్లోనే కాదు…వాస్తవంగా కూడా పత్తి తెల్ల బంగారం లా మెరిసిపోతోంది. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో రోజురోజుకీ పత్తి ధర పెరుగుతూనే ఉంది. దాదాపు మూడు నెలలుగా పత్తి ధర హవా కొనసాగుతూనే ఉంది. కర్నూలు జిల్లాలో ఆదోని మార్కెట్ అతి పెద్ద వ్యవసాయ మార్కెట్. పత్తి, వేరుశనగ పంట పెద్ద ఎత్తున ఆదోని మార్కెట్ కు…
ఏపీలో ఒకవైపు ఏనుగులు, మరోవైపు పులులు సంచారంతో జనం హడలిపోతున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పులి సంచారం జనం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సీసీ కెమెరాలో పులి కదలికలను గుర్తించారు అటవీ శాఖ అధికారులు. సీసీ కెమెరాలు అమర్చి పులి జాడను గుర్తించారు అధికారులు. పులిని పట్టుకునేందుకు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులిని పట్టుకునే పనిలో 120 మంది అటవీ సిబ్బందిని వినియోగిస్తున్నారు. గత పది రోజులుగా ఒమ్మంగి, పోతులూరు, శరభవరం…
వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర శనివారం.. పల్నాడు జిల్లాలో అడుగుపెట్టింది. నరసరావుపేటలో నిర్వహించిన సామాజిక న్యాయభేరి భారీ బహిరంగ సభలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రులు పాల్గొన్నారు. టీడీపీ మహానాడు, చంద్రబాబు తీరుపై మంత్రులు ధ్వజమెత్తారు.
ఏపీలో వైసీపీ నేతలు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలు కొనసాగుతున్నాయి. ఈ యాత్రలపై టీడీపీ మండిపడుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీ నేతల బస్ యాత్ర ఎత్తిపోయింది. వాళ్లే కుర్చీలు తీసుకెళ్తున్నారు.. జనం లేకపోయేసరికి వాళ్లే కుర్చీలను తీసుకెళ్లిపోతున్నారని విమర్శించారు. జగన్ స్వయంగా తమది రివర్స్ పాలన అని చెప్పారు. ఇప్పుడు వైసీపీ బస్ యాత్ర అంతా రివర్సులోనే ఉంది. కైవల్యా రెడ్డి నెల్లూరులో ఆనం కుమార్తెమో కానీ..…
ఏపీలో జగన్ పాలనపై మహానాడు వేదికగా టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మహానాడు 2022లో భాగంగా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న సమావేశంలో ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసంపై తీర్మానం ప్రవేశపెట్టారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి. సీఎం జగనుపై సీరియస్ కామెంట్లు చేశారు సోమిరెడ్డి. వ్యవస్థలపై సీఎం జగనుకు నమ్మకం లేదు. పరిపాలనా వ్యవస్థను జగన్ భ్రష్టుపట్టించారు…. తన తండ్రి హయాంలో జగన్ చేసిన అవినీతికి ఐఏఎస్సులు జైళ్ల పాలయ్యారు. సీఎం హోదాలో ఉన్న జగన్ మాటను…
ఏపీ సీఎం జగన్ దావోస్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దావోస్ వేదికగా జగన్ రెడ్డి చెబుతున్నవన్నీ నిజాలేనా..? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంబులెన్సులు ఉండవు… సెక్యూరిటీ గార్డు, స్వీపర్లు కుట్లు వేసి కట్లు కడతారని చెప్పాల్సింది. కోవిడ్ కాలంలో కేంద్రం ఇచ్చిన నిధులు ఎటుపోయాయి? వైసీపీ ఆర్థిక అరాచకం వల్లే విదేశీ పెట్టుబడులు రావడం లేదన్నారు పవన్. ఏపీలో వైద్యారోగ్య రంగం వెలిగిపోతోందంటూ దావోస్ వేదికగా జగన్ చెప్పిన మాటలను ప్రజలు…
దేశంలో దొంగలు పడడం మామూలే కానీ. ఏపీలో దొంగలు పడ్డారు. ఆ దొంగలకు బంగారం, డబ్బు అవసరం లేదు. వారికేం కావాలో తెలిస్తే మీరే షాకవుతారు. పొలంలో పండిన టమోటా బాక్సులు ఎత్తుకెళ్ళిపోతున్నారు. టమోటా ధరలు ఆకాశాన్నంటిన వేళ దొంగల కళ్ళు టమోటాలపై పడ్డాయి. చిత్తూరు జిల్లా సోమల మండలంలో టమోటాల కోసం దొంగలు పడ్డరు. రాష్ట్రంలో టమోటా ధరలు ఆకాశాన్ని అంటడంతో చిత్తూరు జిల్లా సోమలలో దొంగల బెడద ఎక్కువైందని రైతులు వాపోతున్నారు.ఇన్నిరోజులు ధరలు లేక…