Nandigam Suresh: అమరావతి.. బినామీలతో ఆడిస్తున్న బాబు డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి విషయంలో మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్. అమరావతి ముసుగులో చంద్రబాబు బినామీలు 900 రోజుల కార్యక్రమం చేస్తున్నారు. హరగోపాల్, చంద్రబాబు లాండ్ పూలింగ్ ను వ్యతిరేకించిన వ్యక్తి. వాళ్ళు ఆహ్వానించగానే పోలోమని హరగోపాల్, కోదండరామ్ వచ్చారు.
అమరావతిలో రైతులకు ఎక్కడా అన్యాయం జరగలేదు.. చంద్రబాబు బినామీలకు మాత్రం అన్యాయం జరిగింది.చంద్రబాబు నడిపే అమరావతి తొమ్మిది వందల రోజుల కార్యమానికి హరగోపాల్, కోదండరాం హాజరు కావడంపై వాళ్లే ఆలోచన చెయ్యాలి.అమరావతి పేరుతో చంద్రబాబు ఇంకా మభ్య పెడుతున్నారు. హరగోపాల్, కోదండరాం ఢిల్లీలోని మేధా పాట్కరును కలిస్తే అమరావతి అసలు నిజాలు తెలుస్తాయి. అమరావతిని అభివృద్ధి చేయనని జగన్ చెప్పలేదు.
Also Read
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని జగన్ చెప్పారు.అమరావతి లో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు.గతంలో పేదలకు అండగా ఉండే కమ్యూనిస్టులు ఇప్పుఫు చంద్రబాబుకు అండగా ఉన్నామని చెప్తున్నారు.అమరావతిని నిలబెట్టుకునే కుయుక్తులు చంద్రబాబు చేస్తున్నారు.జగన్ ప్రభుత్వం ఎలా ఉందో ప్రజలే చెప్తారు చంద్రబాబు పిలవగానే వచ్చిన హరగోపాల్,కోదండరాం కాదన్నారు ఎంపీ సురేష్.
చంద్రబాబు అమరావతిలో దళిత, బలహీన వర్గాల వారిని పట్టించుకోలేదు. శంకుస్థాపన రోజు బలహీన వర్గాల వారిని కనీసం పిలవలేదు. స్థానిక ఎమ్మెల్యే పేరు సైతం శిలాఫలకంపై లేదు. చంద్రబాబు తన బినామీలతో ఆడిస్తున్న డ్రామా అమరావతి ఉద్యమం అన్నారు. అది హరగోపాల్,కోదండరాం తెలుసుకోవాలి.మూడు ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం.ఇతర ప్రాంతాలతో పాటు అమరావతిని అభివృద్ధి చేస్తాం.అమరావతి అభివృద్ధి చేయాలని హైకోర్టు చెప్పింది, ముఖ్యమంత్రి కూడా చెప్పారు.రాష్ట్రానికి రాజధాని లేకపోవడానికి కారణం చంద్రబాబు.ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం బీజీపీ. అమరావతిని ఖూనీ చేసింది చంద్రబాబు, అమరావతి రైతుల ఏడ్పు చంద్రబాబుకు తగులుతుందన్నారు ఎంపీ సురేష్.
CPI Narayana: అమరావతిలో జగన్ పోటీ చేయాలి
తాజావార్తలు
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!