Kesineni Nani: ఎంపీ నానిపై బాబాయ్ నాగయ్య ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తనకు అన్యాయం చేసాడంటూ నాని బాబాయి నాగయ్య ఆందోళనకు దిగడం చర్చనీయాంశం అయింది. కేశినేని భవన్ పక్కన తన బిల్డింగ్ నిర్మాణం నిలిపేయాలని టౌన్ ప్లానింగ్ నోటీసులు జారీచేసింది. టౌన్ ప్లానింగ్ ను ఉసిగొల్పి అక్రమ నోటీసులు కేశినేని నాని ఇప్పించాడంటున్నారు నాగయ్య.
నాగయ్య ఊర్లో లేనపుడు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కేశినేని నాని దుర్మార్గుడు.. నా ఆస్తి లాక్కోవాలని చూస్తున్నాడు అంటూ అందోళనకు దిగడంతో ఈ అంశం బెజవాడలో హాట్ టాపిక్ అయింది. కేశినేని నాని చేస్తున్న అన్యాయం అడ్డుకోవాలని నాగయ్య ఆందోళనకు దిగాడు. తనకు అన్యాయం జరిగితే చనిపోతానంటూ నాగయ్య వార్నింగ్ కూడా ఇచ్చాడు. పోలీసులు, అధికారులు తనగోడు పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు నాగయ్య.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వున్న ఎంపీ కేశినేని నాని మౌనంగా వుండడం చర్చనీయాశంగా మారింది. అంతేకాదు, ఒంగోలులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడులో ఎంపీ కేశినేని నాని పాల్గొనలేదు. నాని ఆలోచన ఏంటనేది అంతుచిక్కడం లేదంటున్నారు టీడీపీ శ్రేణులు. మరి, బాబాయ్ నాగయ్య ఆరోపణలపై ఎంపీ నాని ఎలా స్పందిస్తారో చూడాలి. టీడీపీ 2019 లోక్ సభ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. అందులో విజయవాడ నుంచి నాని కాగా, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, శ్రీకాకుళం నుంచి రామ్మోహననాయుడు వున్నారు. వీరిలో నాని పార్లమెంటులో చురుకుగా పాల్గొనేవారు. బెజవాడ పాలిటిక్స్ లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో నాని అంటీముట్టనట్టుగా వ్యవహరించడం చర్చనీయాంశం అవుతోంది.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!