గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. డాక్టర్ వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్లు, హర్వెస్టర్లను జెండా ఊపి ప్రారంభించారు జగన్. రైతులకు పంపిణీ చేసే ట్రాక్టర్ ను స్వయంగా నడిపారు సీఎం జగన్. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయంలో ఖర్చు తగ్గించేందుకు వై.ఎస్.ఆర్. యంత్రసేవా పథకం ప్రారంభిస్తున్నాం అని చెప్పారు. వరి ఎక్కువగా పండించే ప్రాంతాలలో కంబైన్డ్ హార్వెస్టర్ లు అందుబాటులోకి తెస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి రైతు…
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తనకు అన్యాయం చేసాడంటూ నాని బాబాయి నాగయ్య ఆందోళనకు దిగడం చర్చనీయాంశం అయింది. కేశినేని భవన్ పక్కన తన బిల్డింగ్ నిర్మాణం నిలిపేయాలని టౌన్ ప్లానింగ్ నోటీసులు జారీచేసింది. టౌన్ ప్లానింగ్ ను ఉసిగొల్పి అక్రమ నోటీసులు కేశినేని నాని ఇప్పించాడంటున్నారు నాగయ్య. నాగయ్య ఊర్లో లేనపుడు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కేశినేని నాని దుర్మార్గుడు.. నా ఆస్తి లాక్కోవాలని చూస్తున్నాడు అంటూ అందోళనకు దిగడంతో ఈ అంశం బెజవాడలో…
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జైళ్ళ శాఖ డీజీకి లేఖ రాశారు. న్యాయమూర్తి ఆదేశాలు లేకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ ఎమ్మెల్సీ అనంతబాబుకు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పెద్ద నేరస్తుడికి రాజమండ్రి సెంట్రల్ జైలు సిబ్బంది, అధికారులు స్టార్ హోటల్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. రిమాండ్ ఖైదీకి అటువంటి సౌకర్యాలు కల్పించేందుకు అనుమతి ఇవ్వలేదని కోర్టు అధికారులు చెప్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా అనంతబాబుకు ప్రత్యేక గది కేటాయించి, రెండు సెల్ఫోన్లతో నిత్యం…
ఏపీ సీఎం జగన్ గుంటూరు, పల్నాడు జిల్లాలలో పర్యటించనున్నారు.వైయస్సార్ యంత్ర సేవా పథకం – ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల మెగా పంపిణీ చేపట్టనున్నారు. గుంటూరులో రాష్ట్రస్ధాయి మెగా పంపిణీని జెండా ఊపి ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్. ఇప్పటి వరకు 6,781 ఆర్బీకే, 391 క్లస్టర్ స్ధాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు యంత్ర పరికరాల పంపిణీ జరిగింది. రూ. 691 కోట్ల విలువైన ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్ల పంపిణీ చేసింది జగన్ సర్కార్.…
మంగళగిరిలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. సమావేశంలో పాల్గొన్న జనసేన పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు మాజీ మంత్రి అవంతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైజాగ్ రుషి కొండ వ్యూ చాలా అద్భుతమైనది. రుషి కొండను కొట్టేస్తుంటే ప్రతిఘటించింది జనసేనే. అవంతి శ్రీనివాస్ ఎర్ర కొండలు తినేస్తున్నాడు.ఈ పాటికే ఒక కొండ తినేసి ఉండుంటాడు. పవన్ చెప్పింది వింటే.. మన అధ్యక్షుణ్ని 2024లో సీఎంగా చూడవచ్చన్నారు నాగబాబు. పవన్ ఎక్కడికైనా వెళితే సమస్య తీరుతుందని నమ్మకం…
అమరావతి విషయంలో మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్. అమరావతి ముసుగులో చంద్రబాబు బినామీలు 900 రోజుల కార్యక్రమం చేస్తున్నారు. హరగోపాల్, చంద్రబాబు లాండ్ పూలింగ్ ను వ్యతిరేకించిన వ్యక్తి. వాళ్ళు ఆహ్వానించగానే పోలోమని హరగోపాల్, కోదండరామ్ వచ్చారు. అమరావతిలో రైతులకు ఎక్కడా అన్యాయం జరగలేదు.. చంద్రబాబు బినామీలకు మాత్రం అన్యాయం జరిగింది.చంద్రబాబు నడిపే అమరావతి తొమ్మిది వందల రోజుల కార్యమానికి హరగోపాల్, కోదండరాం హాజరు కావడంపై వాళ్లే ఆలోచన…
ఏపీలో ఉప ఎన్నిక మాటున నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. సీపీఐ అగ్రనేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో జగన్ పోటీచేయాలన్నారు నారాయణ. 900 రోజులుగా రైతులు, మహిళలు ఉద్యమాలు చేస్తున్నా జగన్ ప్రభుత్వం కిరాతకంగా వ్యవహరిస్తోంది. న్యాయస్థానాలు సానుకూలంగా స్పందిస్తున్నా ముఖ్యమంత్రి వితండ వాదన చేస్తుండడం దారుణంగా వుందన్నారు. ఆనాడు అమరావతిలో రాజధానిని అంగీకరించారు. ప్రతిపక్షనేతగా ముందు అంగీకరించి ఇప్పుడు ఆడినమాట తప్పుతారా..? మోడీ కాళ్లు మోక్కినంత మాత్రాన జైలుకు పోకుండా ఎవరైనా ఆపగలరా..?ఆత్మకూరులో…
ఏపీలో ఇంకా ఎన్నికలకు టైం వున్నా.. అధికార. విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ, పార్టీ అధినేత చంద్రబాబు నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. యాభై వేల మంది వచ్చిన మహానాడు ప్రజా విజయం కాదు. మా పార్టీ మంత్రులు బస్సు యాత్రకు వెళ్తే లక్షల మంది జనం వస్తున్నారన్నారు. మీకు నిజంగా ప్రజా బలం ఉంటే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి.…
విశాఖపట్నంలో వరుస ప్రమాదాలు జరగడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్.. ఆయన దోపిడీ గ్యాంగ్ ధనదాహంతో విశాఖపట్నం విషాదపట్నమైంది. అధికారంలోకొచ్చిన నుంచీ ఎల్జీ పాలిమార్స్, సాయినార్ ఫార్మా.. నేడు బ్రాండిక్స్ సెజ్ లో ప్రమాదం జరిగాయన్నారు. వరుస విషవాయువు లీక్ ఘటనలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్ లోని సీడ్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకై 200 మంది అస్వస్థతకు…