ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వైఎస్సార్ అచీవ్మెంట్, వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ప్రకటించబడ్డాయి. వివిధ రంగాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేసిన స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసింది. ఎంపికైన వారి జాబితాను కమిటీ వెల్లడించింది.
రాష్ట్రంలోని బీసీ మనసుల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అంటూ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. రాష్ట్రాలు కుల గణన చేసుకోవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.. అందులో భాగంగానే ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం అని ఆయన పేర్కొన్నారు.
ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసెస్ చేయాలనే ఆశావహులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ సర్వీసెస్ అస్పిరెంట్సుకు ఆర్థిక సాయం జగన్ సర్కార్ చేయనుంది.
హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చి ఉచిత వసతి పొందుతున్న ఉద్యోగుల వివరాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. విభాగాల వారీగా ఫ్రీ అకామిడేషన్ పొందుతున్న వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది.
ఇప్పుడు అంతా డిజిటైజ్ అయిపోయింది.. తప్పు చేయడం కుదరదు అని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు తెలిపారు. ఉద్యోగుల సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తాం.. ప్రభుత్వానికి ఉన్న మరి కొద్ది కాలంలో చేయగలిగినంత నేను మంత్రిగా చేస్తాను.. నిర్ణయాలు వెంట వెంటనే తీసుకుంటే ఉద్యోగులకు ఎలాంటి కష్టాలుండవు అని ఆయన అన్నారు.
ఏపీలో స్కూల్స్, కాలేజీలకు జగన్ సర్కార్ దసరా సెలవులను ఖరారు చేసింది. ఏపీలో 13 రోజులు సెలవులు ఇచ్చాయి. అక్టోబరు 13వ తారీఖు నుంచి దసరా సెలవులను ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్ 25 వరకు ఈ సెలవులు ఉంటాయి.
పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో కిలో టమోటా 2 రూపాయలకు మించి అమ్ముడు పోవడం లేదని.. దీంతో పెట్టుబడుల మాట అటుంచి కోత కూలీలు, రవాణ చార్జీలు కూడా దక్కడం లేదని రైతులు వాపోతున్నారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ విద్యార్థులకు అందుబాటులోకి ఐబీ సిలబస్ ను తీసుకొచ్చింది. అంతర్జాతీయంగా ప్రభుత్వ బడి పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు.