దేశం చేస్తోంది రావణాసుర దహనం-మనం చేద్దాం జగనాసుర దహనం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యనించారు. అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దాం అంటూ ఆయన కామెంట్స్ చేశారు. రేపు విజయదశమి పర్వదినం సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల మధ్యలో వీధుల్లోకి వచ్చి “సైకో పోవాలి“ అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయండి అని పిలుపునిచ్చారు. ఆ వీడియో, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయండి అన్నారు. సైకో జగన్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించబోయే విజయంగా ఈ దసరా పండగని సెలబ్రేట్ చేసుకుందాం అంటూ నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.
Read Also: Poonam Kaur: నేను కూడా ఆ బ్యాచ్ లో చేరిపోతా..
సైకో జగన్ విధ్వంస పాలనలో మరో విషాదం జరిగిందని నారా లోకేశ్ తెలిపారు. ప్రచారానికి వేల కోట్లు తగలేస్తూ.. జగనన్న సురక్ష అని డబ్బా కొట్టుకుంటూ.. ఆస్పత్రిలో కనీస వైద్యసదుపాయాలు కల్పించని దుస్థితి నెలకొంది అని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రికి చేరేందుకు వెళ్లే రోడ్లు గుంతలమయమై ప్రాణాలు తీసిన దారుణంగా ఉన్నాయి. చిలకలూరిపేట ఎమ్మెల్యే వైద్యారోగ్య శాఖా మంత్రి విడదల రజనీ సొంత జిల్లాలో జరిగిన ఘోరం అని నారా లోకేశ్ ఆరోపించారు.
Read Also: Nani 31 : నాని సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ను ఫిక్స్ చేసిన మేకర్స్..
పల్నాడు జిల్లా కారంపూడి పట్టణానికి చెందిన బత్తిన ఆనంద్ తన భార్య రామాంజమ్మకి పురిటినొప్పులు రావడంతో స్థానిక పీహెచ్సీకి తీసుకెళితే, సౌకర్యాలు లేవని వైద్యులు చెప్పగా గురజాల ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులూ వైద్యం చేయలేమని చెప్పడంతో నరసరావుపేట తరలించారు అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బైక్‌పై ఇంటికెళ్లి వైద్య ఖర్చులకు డబ్బులు తెస్తూ జూలకల్లు దగ్గర రోడ్డు గుంతల్లో పడి ఆనంద్ తీవ్రంగా గాయపడ్డాడు.. భార్యని ప్రసవానికి చేర్చిన నరసరావుపేట ఆస్పత్రిలోనే ప్రాణాలు వదిలాడు అంటూ ఆరోపించారు. ఆనంద్ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదు.. జగనాసురుడి విధ్వంస పాలన బలి తీసుకుంది.. ఇది సర్కారీ హత్య అని నారా లోకేశ్ మండిపడ్డాడు.